Telugu Global
NEWS

చంద్రబాబుపై చెప్పులు విసిరిన రైతులు, దళితులు

రాజధాని పర్యటనకు వెళ్లిన చంద్రబాబుకు రైతులు, దళితుల నుంచి చేదు అనుభవం ఎదురైంది. బాబు కాన్వాయ్ పై రాజధాని రైతులు, దళితులు చెప్పులతో దాడి చేశారు. ఐదేళ్లు సీఎంగా ఉండి రాజధాని రైతులకు ఏమి చేయకపోగా…. పరామర్శకు వచ్చావా అంటూ నిలదీశారు. ముందే రాజధాని ఎక్కడో తెలుసుకుని టీడీపీ నేతలు రాజధాని ప్రాంతంలో దళితుల భూములను తక్కువ ధరకే కొల్లగొట్టే లా చేశారని బాబుపై దళితులు మండిపడ్డారు. వెంకటాయపాలెం వద్ద రైతులు, దళితులు బాబు కాన్వాయ్ పై చెప్పులు […]

చంద్రబాబుపై చెప్పులు విసిరిన రైతులు, దళితులు
X

రాజధాని పర్యటనకు వెళ్లిన చంద్రబాబుకు రైతులు, దళితుల నుంచి చేదు అనుభవం ఎదురైంది. బాబు కాన్వాయ్ పై రాజధాని రైతులు, దళితులు చెప్పులతో దాడి చేశారు.

ఐదేళ్లు సీఎంగా ఉండి రాజధాని రైతులకు ఏమి చేయకపోగా…. పరామర్శకు వచ్చావా అంటూ నిలదీశారు. ముందే రాజధాని ఎక్కడో తెలుసుకుని టీడీపీ నేతలు రాజధాని ప్రాంతంలో దళితుల భూములను తక్కువ ధరకే కొల్లగొట్టే లా చేశారని బాబుపై దళితులు మండిపడ్డారు.

వెంకటాయపాలెం వద్ద రైతులు, దళితులు బాబు కాన్వాయ్ పై చెప్పులు వేయడంతో వారిపై చంద్రదండు దాడికి ప్రయత్నించింది. ఇంతలో పోలీసులు జోక్యం చేసుకుని నిరసనకారులను చెదరగొట్టారు.

First Published:  28 Nov 2019 5:22 AM GMT
Next Story