Telugu Global
NEWS

బాబు తోక పట్టుకుని ఈదే పార్టీలేవో చూద్దాం...

అమరావతి మీద ప్రేమ ఉంటే కనీసం సొంత ఇంటిని ఇక్కడ ఎందుకు నిర్మించుకోలేదని ప్రశ్నించారు వైసీపీ ఎమ్మెల్యే అంబటి రాంబాబు. అమరావతిలో ఇంటిని నిర్మించుకోకుండా హైదరాబాద్‌లో ఎందుకు నిర్మించుకున్నారని నిలదీశారు. అమరావతిలో దొరికినంత దోచుకుని వెళ్లిపోవాలన్న ఉద్దేశంతోనే చంద్రబాబు పాలన చేశారన్నారు. రాజధానిలో రైతుల పొలాలు తగలబెట్టించి… ఆ కేసును సీరియస్‌గా దర్యాప్తు చేస్తున్న ఇద్దరు ఎస్పీలను ఆరు నెలల్లోనే చంద్రబాబు బదిలీ చేసింది నిజం కాదా అని అంబటి రాంబాబు ప్రశ్నించారు. చంద్రబాబుపై రాజధాని ప్రాంత […]

బాబు తోక పట్టుకుని ఈదే పార్టీలేవో చూద్దాం...
X

అమరావతి మీద ప్రేమ ఉంటే కనీసం సొంత ఇంటిని ఇక్కడ ఎందుకు నిర్మించుకోలేదని ప్రశ్నించారు వైసీపీ ఎమ్మెల్యే అంబటి రాంబాబు. అమరావతిలో ఇంటిని నిర్మించుకోకుండా హైదరాబాద్‌లో ఎందుకు నిర్మించుకున్నారని నిలదీశారు.

అమరావతిలో దొరికినంత దోచుకుని వెళ్లిపోవాలన్న ఉద్దేశంతోనే చంద్రబాబు పాలన చేశారన్నారు. రాజధానిలో రైతుల పొలాలు తగలబెట్టించి… ఆ కేసును సీరియస్‌గా దర్యాప్తు చేస్తున్న ఇద్దరు ఎస్పీలను ఆరు నెలల్లోనే చంద్రబాబు బదిలీ చేసింది నిజం కాదా అని అంబటి రాంబాబు ప్రశ్నించారు.

చంద్రబాబుపై రాజధాని ప్రాంత ప్రజలు తీవ్ర ఆగ్రహంతో ఉన్నారని…. అందుకే నిన్న నిరసన తెలిపారన్నారు. ఆరు నెలలు అయినా తన అవినీతిని బయటకు తీయలేకపోతున్నారని చెబుతున్న చంద్రబాబుకు ముసళ్ల పండుగ మునుముందు ఉందన్నారు.

రాజధాని ప్రాంతంలోనే టీడీపీని చిత్తుచిత్తుగా ప్రజలు ఓడించినా చంద్రబాబుకు బుద్ది రాలేదన్నారు. జగన్‌మోహన్ రెడ్డి పాలనలో బిజీగా ఉన్నారని… దేవినేని ఉమా లాంటి పిచ్చోళ్ల మాటలకు జగన్‌ మోహన్ రెడ్డి సమాధానం చెప్పాల్సిన అవసరం లేదన్నారు.

చంద్రబాబు సాష్టాంగ నమస్కారం చూసి ప్రజలు నవ్వుకుంటున్నారని అంబటి వ్యాఖ్యానించారు. త్వరలోనే అన్ని రాజకీయ పార్టీలను ఏకం చేస్తానని చంద్రబాబు అంటున్నారని… అలా చేసినా తమకేం అభ్యంతరం లేదన్నారు.

కుక్కతోక పట్టుకుని గోదావరి ఈదేందుకు ఏఏ పార్టీలు ముందుకొస్తాయో వేచిచూద్దామన్నారు. రాజధాని నిర్మాణ ఆలస్యంపై కేంద్రానికి చంద్రబాబు ఫిర్యాదు చేసినా తమకేమీ అభ్యంతరం లేదన్నారు.

రాజధాని నిర్మాణం గురించి కేంద్రం అడిగితే సమాధానం ఇచ్చేందుకు ప్రభుత్వం సిద్దంగా ఉందన్నారు. ప్రధాని మోడీ వస్తే నల్లజెండాలు చూపిన చంద్రబాబే ఇప్పుడు మోడీపై ఎనలేని ప్రేమను ఒలకబోస్తున్నారని అంబటి విమర్శించారు.

First Published:  29 Nov 2019 3:48 AM GMT
Next Story