షూటింగ్ పూర్తిచేసుకున్న బాలయ్య సినిమా

బాలకృష్ణ హీరోగా నటిస్తున్న రూలర్ సినిమా షూటింగ్ పూర్తిచేసుకుంది. కేఎస్ రవికుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాకు గుమ్మడికాయ కొట్టారు. సినిమాను డిసెంబర్ 20కు విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.

రూలర్ లో రెండు డిఫరెంట్ షేడ్స్ లో కనిపించబోతున్నాడు బాలయ్య. ఈ రెండు లుక్స్ ను ఇప్పటికే విడుదల చేశారు. వీటిలో ఓ లుక్ కోసం ఏకంగా 8 కిలోల బరువు తగ్గాడు బాలయ్య. ఆ లుక్ సోషల్ మీడియాలో వైరల్ అయిన విషయం తెలిసిందే. ఈ వయసులో ఓ పాత్ర కోసం ఇలా బరువు తగ్గడం రిస్క్ అయినప్పటికీ, బాలయ్య వెనకడుగు వేయలేదు.

సోనాల్ చౌహాన్, వేదిక హీరోయిన్లుగా నటిస్తున్న ఈ సినిమాలో భూమిక ఓ కీలక పాత్రలో కనిపించనుంది. ప్రకాష్ రాజ్, జయసుధ కూడా కీలక పాత్రల్లో కనిపించబోతున్నారు. జైసింహా తర్వాత బాలయ్య, కేఎస్ రవికుమార్ కాంబోలో వస్తున్న సినిమా కావడంతో మూవీపై అంచనాలు పెరిగాయి. క్రిస్మస్ కానుకగా డిసెంబర్ 20న రూలర్ ను థియేటర్లలోకి తీసుకొస్తున్నారు.