టెర్రరిస్ట్ గా మారిన సమంత

హీరోయిన్ సమంత ఒక్కసారిగా యూటర్న్ తీసుకుంది. సినిమాల్ని తాత్కాలికంగా పక్కనపెట్టి వెబ్ సిరీస్ కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అమెజాన్ ప్రైమ్ వీడియోస్ లో సూపర్ హిట్ అయిన ది ఫ్యామిలీ మేన్ సీజన్-2లో సమంత నటిస్తోంది. సమంతపై షూటింగ్ స్టార్ట్ అయింది. సిరీస్ లో ఆమె మహిళా ఉగ్రవాది పాత్రలో కనిపించబోతోంది.

నిజానికి సమంత కెరీర్ ఇప్పుడు బాగుంది. రీసెంట్ గా ఆమె చేసిన ఓ బేబీ సినిమా కూడా మంచి విజయం సాధించింది. ఆమె కోసమే ప్రత్యేకంగా కథలు సిద్ధం చేస్తున్నారు మేకర్స్. ఇలాంటి టైమ్ లో ఆశ్చర్యకరంగా వెబ్ సిరీస్ వైపు అడుగులు వేసింది సమంత.

క్యారెక్టర్ బాగుంటే, ఏ ఫార్మాట్ లోనైనా నటించడానికి సిద్ధమని సమంత ఇదివరకే ప్రకటించింది. చెప్పినట్టుగానే వెబ్ సిరీస్ లో నటిస్తోంది. అంతేకాదు.. ఈ రోల్ చేసేందుకు ఆమె భారీ మొత్తం అందుకుంటోంది. అటుఇటుగా సమంతకు కోటిన్నర పారితోషికం ఇచ్చినట్టు తెలుస్తోంది.

ఈ వెబ్ సిరీస్ కోసం నెల రోజులు కాల్షీట్లు కేటాయించింది సమంత. అంటే, ఓ సినిమాకు కేటాయించే కాల్షీట్ల కంటే తక్కువే. పైగా రెమ్యూనరేషన్ ఎక్కువ. త్వరలోనే ది ఫ్యామిలీ మేన్ సీజన్-2 అమెజాన్ ప్రైమ్ లో రానుంది. ఇందులో సందీప్ కిషన్, ప్రియమణి, మనోజ్ బాజ్ పాయ్ లాంటి నటులు ఉన్న విషయం తెలిసిందే.