Telugu Global
NEWS

దేశవాళీ క్రికెట్లో అభిమన్యు మిథున్ అరుదైన రికార్డు

ఆరుబాల్స్ లో 5 వికెట్లతో సంచలనం ముస్తాక్ అలీ ట్రోఫీలో మిథున్ హ్యాట్రిక్… కర్నాటక ఫాస్ట్ బౌలర్ అభిమన్యు మిథున్ ..దేశవాళీ క్రికెట్లో అరుదైన రికార్డుల పరంపర కొనసాగిస్తున్నాడు. దేశవాళీ క్రికెట్ అన్ని ఫార్మాట్లలోనూ హ్యాట్రిక్ లు సాధించిన మొనగాడిగా, ఏకైక బౌలర్ గా నిలిచాడు. జాతీయ టీ-20 టోర్నీ సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ సెమీఫైనల్స్ మ్యాచ్ లో భాగంగా హర్యానాతో జరిగిన పోరులో మిథున్ కళ్లు చెదిరే హ్యాట్రిక్ సాధించాడు. సూరత్ వేదికగా జరిగిన మ్యాచ్ […]

దేశవాళీ క్రికెట్లో అభిమన్యు మిథున్ అరుదైన రికార్డు
X
  • ఆరుబాల్స్ లో 5 వికెట్లతో సంచలనం
  • ముస్తాక్ అలీ ట్రోఫీలో మిథున్ హ్యాట్రిక్…

కర్నాటక ఫాస్ట్ బౌలర్ అభిమన్యు మిథున్ ..దేశవాళీ క్రికెట్లో అరుదైన రికార్డుల పరంపర కొనసాగిస్తున్నాడు. దేశవాళీ క్రికెట్ అన్ని ఫార్మాట్లలోనూ హ్యాట్రిక్ లు సాధించిన మొనగాడిగా, ఏకైక బౌలర్ గా నిలిచాడు.

జాతీయ టీ-20 టోర్నీ సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ సెమీఫైనల్స్ మ్యాచ్ లో భాగంగా హర్యానాతో జరిగిన పోరులో మిథున్ కళ్లు చెదిరే హ్యాట్రిక్ సాధించాడు.

సూరత్ వేదికగా జరిగిన మ్యాచ్ లో హర్యానాను చిత్తు చేయడంలో ప్రధానపాత్ర వహించాడు.

మిథున్ ఆఖరి ఓవర్ ఆరు బంతుల్లో హ్యాట్రిక్ తో సహా 5 వికెట్లు పడగొట్టడం ద్వారా..కర్నాటకకు ఫైనల్లో చోటు ఖాయం చేశాడు.

సూరత్ లాల్ బాయి కాంట్రాక్టర్ స్టేడియంలో జరిగిన ఈ నాకౌట్ మ్యాచ్ లో మిథున్ 39 పరుగులిచ్చి 5 వికెట్లు పడగొట్టాడు.

మిథున్ పగ్గాలు వేయడంతో హర్యానా 20 ఓవర్లలో 8 వికెట్లకు 198 పరుగుల స్కోరుకే పరిమితం కావాల్సి వచ్చింది.
సమాధానంగా కర్నాటక 15 ఓవర్లలోనే విజయలక్ష్యాన్ని పూర్తి చేసి… ఫైనల్స్ కు చేరుకొంది. టైటిల్ సమరంలో చిరకాల ప్రత్యర్థి తమిళనాడుతో కర్నాటక అమీతుమీ తేల్చుకోనుంది.

తొలి బౌలర్ అభిమన్యు మిథున్..

కర్నాటక ఫాస్ట్ బౌలర్ అభిమన్యు మిథున్ భారత దేశావాళీ క్రికెట్లో తనకంటూ ఓ ప్రత్యేకస్థానం సాధించాడు. రంజీ ట్రోఫీ, ముస్తాక అలీ ట్రోఫీ, దులీప్ ట్రోఫీ మ్యాచ్ ల్లో హ్యాట్రిక్ లు సాధించిన ఏకైక బౌలర్ గా చరిత్ర సృష్టించాడు.

2009లో ఉత్తర ప్రదేశ్ తో జరిగిన రంజీ మ్యాచ్ లో హ్యాట్రిక్ సాధించిన మిథున్…బెంగళూరు వేదికగా తమిళనాడుతో జరిగిన విజయ్ హజారే టోర్నీలో సైతం హ్యాట్రిక్ సాధించాడు.

ఇప్పుటు సూరత్ వేదికగా హర్యానాతో జరిగిన టీ-20 ముస్తాక్ అలీ ట్రోఫీలో సైతం హ్యాట్రిక్ నమోదు చేయగలిగాడు.

First Published:  30 Nov 2019 5:45 AM GMT
Next Story