అర్జున్ సురవరం మొదటి రోజు వసూళ్లు

తెలుగు రాష్ట్రాల్లో 9 కోట్ల రూపాయలకు అమ్మారు అర్జున్ సురవరం సినిమాని. ఏపీ, నైజాంలో ఈ సినిమాకు మొదటి రోజు కోటి 35 లక్షల రూపాయల షేర్ వచ్చింది. వరల్డ్ వైడ్ ఈ సినిమాకు 4 కోట్ల 10 లక్షల రూపాయల గ్రాస్ వచ్చినట్టు మేకర్స్ ప్రకటించుకున్నారు.

తొలిరోజు ఈ సినిమాకు యావరేజ్ టాక్ వచ్చింది. ఈరోజు, రేపు ఈ సినిమాకు వచ్చే టాక్ ఆధారంగా ఈ సినిమా బ్రేక్-ఈవెన్ ఆధారపడి ఉంటుంది. ఇక్కడ కొసమెరుపు ఏంటంటే.. నిజంగా ఈ సినిమాకు 9 కోట్లు వచ్చి బ్రేక్-ఈవెన్ అయినా దాన్ని సేఫ్ పొజిషన్ కింద చెప్పలేం. ఎందుకంటే ఏడాది కిందట రిలీజ్ అవ్వాల్సిన ఈ సినిమా చాలా ఆర్థిక కష్టాలు చూసింది. ఏడాది పాటు లక్షల్లో వడ్డీలు కట్టారు. అవన్నీ కలుపుకుంటే, ఈ సినిమాకు 9 కోట్లు వచ్చినా నిర్మాతకు లాభం కింద రాదు. ఇక తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమాకు మొదటి రోజు వచ్చిన షేర్ ఇలా ఉంది.

నైజాం -రూ. 0.31 కోట్లు
సీడెడ్ – రూ. 0.17 కోట్లు
ఉత్తరాంధ్ర – రూ. 0.19 కోట్లు
ఈస్ట్ – రూ. 0.12 కోట్లు
వెస్ట్ – రూ. 0.10 కోట్లు
గుంటూరు – రూ. 0.29 కోట్లు
నెల్లూరు – రూ. 0.09 కోట్లు
కృష్ణా – రూ. 0.12 కోట్లు