సిక్స్ ప్యాక్ లుక్ లో బెల్లంకొండ సినిమా

మరోసారి కంప్లీట్ యాక్షన్ మోడ్ లోకి వెళ్లాడు బెల్లంకొండ సాయిశ్రీనివాస్. సంతోష్ శ్రీనివాస్ దర్శకత్వంలో ఈ హీరో ఓ సినిమా చేస్తున్నాడనగానే, అది కందిరీగ టైపులో యాక్షన్, వినోదం మేళవింపుగా ఉంటుందని అంతా భావించారు. కానీ ఇందులో ఎంటర్ టైన్ మెంట్ కంటే యాక్షన్ పార్ట్ ఎక్కువగా ఉంటుందని ప్రకటించాడు దర్శకుడు. సినిమా లాంఛ్ అయింది.

రామానాయుడు స్టూడియోస్ లో ఘ‌నంగా ప్రారంభ‌మైన ఈ సినిమాకు, ముహూర్త‌పు స‌న్నివేశానికి సెన్సేష‌న‌ల్ డైరెక్ట‌ర్ వి.వి.వినాయ‌క్ క్లాప్ కొట్ట‌గా, నిర్మాత జెమిని కిర‌ణ్ కెమెరా స్విచాన్ చేశారు. ప్ర‌ముఖ నిర్మాత‌ దిల్ రాజు గౌర‌వ ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు. డిసెంబర్ 6 నుంచి రెగ్యులర్ షూటింగ్ ఉంటుంది. సినిమాకు ఎలాంటి బ్రేక్స్ ఇవ్వకుండా నాన్-స్టాప్ గా షూటింగ్ చేయాలని నిర్ణయించారు. వచ్చే ఏడాది సమ్మర్ నాటికి మూవీని సిద్ధం చేయాలనేది టార్గెట్.

ఈ సినిమాలో హీరోయిన్ గా నభా నటేష్ ను సెలక్ట్ చేశారు. ఈరోజు జరిగిన ఓపెనింగ్ కు ఆ ముద్దుగుమ్మ కూడా హాజరైంది. ఈ సినిమాకు దేవిశ్రీప్రసాద్ సంగీతం అందించబోతున్నాడు. దేవిశ్రీ, బెల్లంకొండ కాంబినేషన్ లో ఇది మూడో సినిమా. ఇంతకుముందు వీళ్లిద్దరూ కలిసి అల్లుడు శీను, జయజానకి నాయక సినిమాలకు వర్క్ చేశారు.