మరో హీరోయిన్ పెళ్లి

మొన్నటికిమొన్న అర్చన పెళ్లి హాట్ టాపిక్ గా మారింది. నిశ్చితార్థం నుంచి పెళ్లి వరకు ప్రతి విషయాన్ని చెప్పి చేసుకుంది ఆ హీరోయిన్. ఉన్నంతలో టాలీవుడ్ ప్రముఖుల్ని కూడా ఆహ్వానించింది. అయితే నిన్న పెళ్లి చేసుకున్న ఓ హీరోయిన్ మాత్రం గుంభనంగా పని కానిచ్చేసింది. ఆమె పేరు మనాలీ రాధోడ్.

పలు సినిమాల్లో హీరోయిన్ గా నటించిన మనాలీ రాధోడ్ నిన్న రాత్రి హైదరాబాద్ లో పెళ్లి చేసుకుంది. ఔత్సాహిక పారిశ్రామికవేత్త రవి ఇజ్జార్ ను ఆమె పెళ్లాడింది. ఈ వివాహానికి రాజశేఖర్, బ్రహ్మాజీ, జీవిత, హేమ లాంటి ప్రముఖులు హాజరయ్యారు.

వంశీ తీసిన ఫ్యాషన్ డిజైనర్ సన్నాఫ్ లేడీస్ టైలర్ సినిమాతో పాపులర్ అయింది మనాలీ రాధోడ్. అయితే ఆ సినిమా ఫ్లాప్ అయింది. ఆ తర్వాత చేసిన గ్రీన్ సిగ్నల్, ఓ స్త్రీ రేపు రా వంటి చిత్రాలు కూడా ఆమె కెరీర్ లో ఫ్లాపులుగా నిలిచాయి. దీంతో కోలీవుడ్ కు వెళ్లింది మనాలీ. అక్కడ కూడా ఆమెను ఫ్లాపులు వెక్కిరించాయి. అలా కొన్నాళ్లుగా లైమ్ లైట్ కు దూరమైన మనాలీ, పెళ్లి చేసుకొని లైఫ్ లో సెటిలైంది.