”లేచిపోయిందా?” అని అడగడానికి సిగ్గుందిరా మీకు – పూనమ్ కౌర్

వైద్యురాలు ప్రియాంక రెడ్డి హత్యపై ప్రముఖ నటి పూనమ్ కౌర్ తీవ్రంగా స్పందించారు. భావోద్వేగంతో ఒక వీడియోను విడుదల చేశారు. మహిళల రక్షణ పట్ల ఆమె ఆందోళన వ్యక్తం చేశారు. ప్రియాంక రెడ్డిపై దారుణానికి ఒడిగట్టిన ఆ నాలుగు జంతువులను చంపేసి తాను జైలుకు వెళ్లేందుకు సిద్ధంగా ఉన్నానని వ్యాఖ్యానించారు.

ప్రియాంక కనిపించలేదు అని ఫిర్యాదు చేసేందుకు వచ్చిన ఆమె తల్లితో… మీ అమ్మాయి ఎవరితోనైనా లేచిపోయి ఉంటుంది అని పోలీసులు అనడంపై పూనం తీవ్రంగా స్పందించారు. ”మీ అమ్మాయి లేచిపోయిందా?” అని అడగడానికి సిగ్గుందిరా అని పోలీసులపై ఫైర్ అయ్యారామె.

మహిళలపై దారుణాలకు ఒడిగట్టిన వారిపై చర్యల విషయంలో పరిస్థితి షరా మామూలుగా తయారైందన్నారు. మరో రెండు, మూడు రోజులు ఈ కేసుపై హైప్ తీసుకొస్తారని.. ఆ తర్వాత అందరూ మర్చిపోతారని పూనమ్ ఆవేదన చెందారు.

PriyankaReddy Issue

#JusticeForPriyankaReddy

Posted by Poonam Kaur on Saturday, 30 November 2019