సరిలేరు సాంగ్స్ వచ్చేస్తున్నాయి

మహేష్ బాబు హీరోగా నటిస్తున్న సరిలేరు నీకెవ్వరు సినిమా పాటల కోసం అంతా వెయిటింగ్. దీనికో కారణం ఉంది. ఈ సినిమాకు పోటీగా ముస్తాబవుతున్న అల వైకుంఠపురములో సినిమా పాటలు సూపర్ హిట్ అవుతున్నాయి. ఇప్పటికే విడుదలైన 3 పాటలు హిట్ అయ్యాయి. అందుకే ఇప్పుడంతా మహేష్ మూవీలో సాంగ్స్ కోసం వెయిట్ చేస్తున్నారు. ఇప్పుడా టైమ్ రానే వచ్చింది.

దేవిశ్రీ ప్రసాద్ కంపోజ్ చేసిన సరిలేరు నీకెవ్వరు సినిమా పాటల్ని ఒక్కొక్కటిగా విడుదల చేయడానికి ముహూర్తం ఫిక్స్ చేశారు. ఇంట్రెస్టింగ్ ఎలిమెంట్ ఏంటంటే.. ఏ పాట ఎప్పుడు రిలీజ్ చేయాలనే షెడ్యూల్ కూడా ముందుగానే ఫిక్స్ చేసి విడుదల చేయడం విశేషం. డిసెంబర్ 2న ఈ సినిమాకు సంబంధించి తొలి లిరికల్ వీడియో రిలీజ్ చేస్తారు. ఇక అక్కడ్నుంచి వరుసగా 9, 16, 23, 30 తేదీల్లో పాటల్ని రిలీజ్ చేయబోతున్నారు.

సరిలేరు నీకెవ్వరు సినిమాకు సంబంధించి ఇప్పటికే టీజర్ రిలీజైంది. దానికి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈ పాటల విడుదల కార్యక్రమం కూడా అయిన తర్వాత ట్రయిలర్ లాంఛ్ చేసి, ఎప్పట్లానే ప్రీ-రిలీజ్ ఫంక్షన్ పెట్టబోతున్నారు. సంక్రాంతి కానుకగా జనవరి 11న సరిలేరు నీకెవ్వరు సినిమా థియేటర్లలోకి రాబోతోంది.