రిలీజ్ కు ముందే అతిపెద్ద రికార్డు

సంక్రాంతికి విడుదలకాబోతోంది అల్లు అర్జున్ నటిస్తున్న అల వైకుంఠపురములో సినిమా. అయితే విడుదలకు ముందే ఈ సినిమా సాంగ్స్ తో రికార్డుల మీద రికార్డులు సృష్టిస్తోంది. మరీ ముఖ్యంగా సామజవరగమ అనే పాటైతే ఆల్ టైమ్ హిట్ అయింది.

తాజాగా యూట్యూబ్ లో ఈ సాంగ్ కు 100 మిలియన్ వ్యూస్ వచ్చాయి. టాలీవుడ్ చరిత్రలోనే అత్యంత వేగంగా వంద మిలియన్ వ్యూస్ సాధించిన పాటగా ఇది రికార్డు సృష్టించింది.

ఈ పాట ఎంత హిట్ అయిందంటే.. పాకిస్థాన్ జనాలు కూడా ఈ పాట విన్నారు. దానిపై రివ్యూలు పెట్టారు. ఈ పాట తర్వాత విడుదల చేసిన రాములో రాములా సాంగ్ కూడా పెద్ద హిట్ అయింది. మూడో సాంగ్ గా విడుదలైన ఓ మై గాడ్ డాడీ సాంగ్ కూడా ఓ మోస్తరుగా హిట్ అయింది. ఇలా బ్యాక్ టు బ్యాక్ 3 సాంగ్స్ హిట్ అవ్వడంతో, మేకర్స్ ఇప్పుడు టీజర్ పై కన్నేశారు.

అల వైకుంఠపురములో టీజర్ రెడీ అవుతోంది. త్వరలోనే ఈ టీజర్ రిలీజ్ డేట్ ను ఎనౌన్స్ చేయబోతున్నారు. టీజర్ రిలీజైన తర్వాత కాస్త గ్యాప్ ఇచ్చి మళ్లీ సాంగ్స్ ను విడుదల చేస్తారు. ఇలా విడుదల వరకు ఏదో ఒక రూపంలో సినిమాకు ప్రచారం కల్పించబోతోంది యూనిట్.