నిఖిల్ అప్ కమింగ్ మూవీస్

తన కొత్త సినిమా రిలీజ్ సందర్భంగా అప్ కమింగ్ మూవీస్ లిస్ట్ ప్రకటించాడు నిఖిల్. ఇకపై ఎలాంటి గ్యాప్స్ ఇవ్వనని, ఏడాదికి మినిమం 2 సినిమాలు రిలీజ్ చేస్తానని ప్రకటించాడు. ఈ నేపథ్యంలో తన లైనప్ మొత్తం బయటపెట్టాడు నిఖిల్.

అర్జున్ సురవరం థియేటర్లలోకి వచ్చేయడంతో, నిఖిల్ ఇప్పుడు తన ఫోకస్ మొత్తాన్ని కార్తికేయ-2 సినిమాపై పెట్టాడు. ఈ సినిమా సెట్స్ పై ఉంటుండగానే, వీఐ ఆనంద్ దర్శకత్వంలో గీతాఆర్ట్స్-2 బ్యానర్ పై మరో సినిమాను సెట్స్ పైకి తీసుకొచ్చే ఆలోచనలో ఉన్నాడు.

ఈ రెండు సినిమాలతో పాటు హనుమంతు అనే మరో మూవీని కూడా లైన్లో పెట్టాడు ఈ హీరో. రోబోటిక్స్ నేపథ్యంలో సాగే ఈ సినిమా ఫాంటసీ కాన్సెప్ట్ తో చాలా థ్రిల్లింగ్ గా ఉంటుందని అంటున్నాడు. ఈమధ్య శ్వాస అనే సినిమా స్టార్ట్ చేశాడు నిఖిల్. నివేత థామస్ హీరోయిన్ గా రావాల్సిన ఆ సినిమా ఆగిపోయింది. ఆ స్థానంలో, శ్వాస నిర్మాతలకు హనుమంతు సినిమాను చేసిపెడుతున్నాడు నిఖిల్.