షూటింగ్ అప్ డేట్స్ (01-12-19)

ప్రతిరోజూ పండగే

సాయితేజ్, రాశిఖన్నా హీరోహీరోయిన్లుగా నటిస్తున్న మారుతి దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా ప్రతి రోజూ పండగే. తాజాగా ఈ సినిమా షూటింగ్ కంప్లీట్ అయింది. అన్నపూర్ణ స్టుడియోస్ లో వేసిన ప్రత్యేకమైన సెట్ లో హీరోహీరోయిన్ల మధ్య తీసిన ఓ సాంగ్ తో ఈ మూవీ పూర్తయింది. డిసెంబర్ 20న సినిమాను థియేటర్లలోకి తీసుకురాబోతున్నారు.

రూలర్

బాలయ్య కూడా రూలర్ సినిమాను పూర్తిచేశాడు. రామోజీ ఫిలింసిటీలో షూట్ చేసిన ఓ పాటతో ఈ సినిమా షూటింగ్ మొత్తం పూర్తయినట్టు నిర్మాత సి.కల్యాణ్ ప్రకటించాడు. ఇవాళ్టి నుంచి ఈ సినిమా లిరికల్ వీడియోస్ రిలీజ్ చేస్తున్నారు. మూవీని ఈనెల 20న థియేటర్లలోకి తీసుకురాబోతున్నారు.

సరిలేరు నీకెవ్వరు

మహేష్ హీరోగా నటిస్తున్న సరిలేరు నీకెవ్వరు సినిమా కేరళ షెడ్యూల్ పూర్తిచేసుకుంది. రేపట్నుంచి రామోజీ ఫిలింసిటీలో ఈ మూవీకి సంబంధించి కొత్త షెడ్యూల్ మొదలవుతుంది. ఈ షెడ్యూల్ లో మహేష్-రష్మిక మధ్య ఓ సాంగ్ తీయబోతున్నారు. అనిల్ రావిపూడి డైరక్ట్ చేస్తున్న ఈ సినిమాకు దేవిశ్రీప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు.

క్రాక్

గోపీచంద్ మలినేని దర్శకత్వంలో రవితేజ హీరోగా నటిస్తున్న సినిమా క్రాక్. ఈమధ్యే ప్రారంభమైన ఈ సినిమా ప్రస్తుతం ఫస్ట్ షెడ్యూల్ జరుపుకుంటోంది. శంషాబాద్ లో హీరోపై కొన్ని యాక్షన్ సన్నివేశాలు చిత్రీకరిస్తున్నారు. ఈ షెడ్యూల్ పూర్తయిన తర్వాత ముంబయిలో రెండో షెడ్యూల్ ఉంటుంది. ఈ షెడ్యూల్ లో హీరోయిన్ శృతిహాసన్ జాయిన్ అవుతుంది.

రెడ్

రామ్ హీరోగా నటిస్తున్న రీమేక్ మూవీ రెడ్. కిషోర్ తిరుమల దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం హైదరాబాద్ శివార్లలోని కొంపల్లిలో జరుగుతోంది. హీరోపై కొన్ని ఎలివేషన్ సన్నివేశాలు తీస్తున్నారు. తమిళ్ హిట్ అయిన తడమ్ కు రీమేక్ గా వస్తున్న ఈ సినిమాను స్రవంతి రవికిషోర్ నిర్మిస్తున్నాడు. వచ్చే ఏడాది మార్చిలో మూవీని థియేటర్లలోకి తీసుకురాబోతున్నారు.