అర్జున్ సురవరం వారాంతం వసూళ్లు

అర్జున్ సురవరం అదరగొట్టాడు. మొదటి రోజు మిక్స్ డ్ టాక్ తెచ్చుకున్నప్పటికీ, వసూళ్ల పరంగా ఈ సినిమా బెస్ట్ అనిపించుకుంది. ఇంకా చెప్పాలంటే, నిన్నటితో ఫస్ట్ వీకెండ్ పూర్తిచేసుకున్న ఈ సినిమా సగం బ్రేక్-ఈవెన్ అయింది.

తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమా 9 కోట్ల రూపాయల ప్రీ-రిలీజ్ బిజినెస్ చేసింది. నిన్నటి వసూళ్లతో కలుపుకొని ఈ సినిమాకు 3 కోట్ల 32 లక్షల రూపాయల షేర్ వచ్చింది. ఓవర్సీస్ కలెక్షన్ తో కలుపుకొని ఈ సినిమా సగానికి పైగా బ్రేక్ ఈవెన్ అయినట్టుంది.

ఇక గ్రాస్ పరంగా చూసుకుంటే… వరల్డ్ వైడ్ ఈ సినిమాకు 7 కోట్ల 55 లక్షల రూపాయల గ్రాస్ వచ్చింది. తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమాకు 3 రోజుల్లో వచ్చిన షేర్ ఇలా ఉంది.

నైజాం – రూ. 0.38 కోట్లు
సీడెడ్ – రూ. 0.43 కోట్లు
ఉత్తరాంధ్ర – రూ. 0.52 కోట్లు
ఈస్ట్ – రూ. 0.28 కోట్లు
వెస్ట్ – రూ. 0.27 కోట్లు
గుంటూరు – రూ. 0.38 కోట్లు
నెల్లూరు – రూ. 0.23 కోట్లు
కృష్ణా – రూ. 0.36 కోట్లు