Telugu Global
National

మహారాష్ట్రలో బీజేపీకి షాక్‌ తగలబోతోందా?

మహారాష్ట్రలో బీజేపీకి షాక్‌ తగలబోతుంది. ఆ పార్టీ కీలక నేతలు పార్టీకి గుడ్‌ బై చెప్పే యోచనలో ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. బీజేపీ అధికారానికి దూరం కావడంతో కొందరు కీలక నేతలు ఇతర పార్టీల వైపు చూస్తున్నట్లు తెలుస్తోంది. పంకజ గోపినాథ్‌ ముండే. ఒకప్పటి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు గోపినాథ్‌ ముండే కూతురు. ఆయన మరణం తర్వాత ఆయన ఇద్దరు కూతుళ్లు రాజకీయాల్లోకి వచ్చారు. పంకజముండే బీడ్ జిల్లా పర్లి నియోజకవర్గం నుంచి గత ఎన్నికల్లో ఎమ్మెల్యేగా […]

మహారాష్ట్రలో బీజేపీకి షాక్‌ తగలబోతోందా?
X

మహారాష్ట్రలో బీజేపీకి షాక్‌ తగలబోతుంది. ఆ పార్టీ కీలక నేతలు పార్టీకి గుడ్‌ బై చెప్పే యోచనలో ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. బీజేపీ అధికారానికి దూరం కావడంతో కొందరు కీలక నేతలు ఇతర పార్టీల వైపు చూస్తున్నట్లు తెలుస్తోంది.

పంకజ గోపినాథ్‌ ముండే. ఒకప్పటి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు గోపినాథ్‌ ముండే కూతురు. ఆయన మరణం తర్వాత ఆయన ఇద్దరు కూతుళ్లు రాజకీయాల్లోకి వచ్చారు. పంకజముండే బీడ్ జిల్లా పర్లి నియోజకవర్గం నుంచి గత ఎన్నికల్లో ఎమ్మెల్యేగా గెలిచారు. దేవేంద్ర ఫడ్నవీస్‌ కేబినెట్‌లో మంత్రిగా పనిచేశారు. మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో తన సోదరుడు,ఎన్సీపీ నేత ధనుంజయ్‌ ముండే చేతిలో ఓడిపోయారు.

పంకజ్‌ ముండే సడెన్‌గా తన ఫేస్‌బుక్‌ పేజీలో ఓ పోస్టు పెట్టారు. భవిష్యత్‌ రాజకీయాల గురించి తీవ్రంగా ఆలోచిస్తున్నట్లు చెప్పారు. డిసెంబర్‌ 15 తన తండ్రి గోపినాథ్‌ ముండే వర్ధంతి కోసం అభిమానులు పెద్ద ఎత్తున తరలిరావాలని పిలుపునిచ్చారు. అందులో భాగంగా అదే రోజున ఆమె కీలక నిర్ణయం ప్రకటించే అవకాశం ఉంది.

మరోవైపు పంకజ్‌ ట్విట్టర్‌లో కూడా తన పార్టీ పేరును తీసివేశారు. దీంతో ఆమె పార్టీ మారుతారనే ప్రచారం మొదలైంది. ఆమె శివసేనలో చేరుతారని టాక్‌ విన్పిస్తోంది. ఇటీవల బీజేపీలో జరిగిన పరిణామాలతో ఆమె మనసు మార్చుకున్నట్లు తెలుస్తోంది. అధికార పార్టీలో చేరాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది.

మరోవైపు పంకజ్‌ సోదరి ప్రీతమ్‌ ముండే ఇప్పుడు బీడ్‌ నుంచి లోక్‌సభకు ఎంపీగా ఎన్నికయ్యారు. రెండు సార్లు ఆమె ఎంపీగా గెలిచారు. అయితే పంకజ్‌ ఈ స్టెప్‌ తీసుకుంటే ఆమె సోదరి కూడా బీజేపీ నుంచి బయటకు వస్తారా? లేదా అనేది సస్పెన్స్‌గా మారింది.

First Published:  2 Dec 2019 5:54 AM GMT
Next Story