తెలంగాణలో భారీగా బస్సు చార్జీల పెంపు

తెలంగాణ ప్రభుత్వం ఆర్టీసీ బస్సు చార్జీలను భారీగా పెంచింది. ఇటీవల సీఎం కేసీఆర్ ప్రకటించినట్టుగానే నేటి అర్థరాత్రి నుంచి బస్సు చార్జీల పెంపుకు నిర్ణయం తీసుకున్నారు. చార్జీలతో పాటు టోల్ ప్లాజా, జీఎస్టీ, ప్యాసింజర్ సెస్‌ను అదనంగా వసూలు చేస్తారు. చార్జీల పెంపుతో ఏడాదికి రూ.752 కోట్ల అదనపు ఆదాయం వచ్చేలా చూస్తామని ఇటీవల కేసీఆర్ ప్రకటించారు. అందుకు తగ్గట్టుగానే చార్జీలను నేటి నుంచి పెంచుతున్నారు. కనీస చార్జీపై కి.మీ. కు 20 పైసలు పెంచారు.

 • పల్లె వెలుగు కనీస చార్జీ రూ.5 నుంచి రూ.10కు పెంపు
 • సెమీ ఎక్స్‌ప్రెస్‌ కనీస చార్జీ రూ.10గా నిర్దారించిన అధికారులు
 • ఎక్స్‌ప్రెస్‌ కనీస చార్జీ రూ.10 నుంచి రూ.15కి పెంపు
 • డీలక్స్‌ కనీస చార్జీ రూ.15 నుంచి రూ.20కి పెంపు
 • సూపర్‌ లగ్జరీ కనీస చార్జీ రూ.25 కి పెంపు
 • రాజధాని, వజ్ర బస్సుల్లో కనీస చార్జీ రూ.35
 • గరుడ ఏసీ లో కనీస చార్జీ రూ.35
 • గరుడ ప్లస్ ఏసీలో కనీస చార్జీ రూ.35
 • వెన్నెల ఏసీ స్లీపర్ లో కనీస చార్జీ రూ.70కు పెంచారు.

కనీస చార్జీపై కిలోమీటర్‌కు 20 పైసలు అధికంగా వసూలు చేయాలని ఆర్టీసీ నిర్ణయం తీసుకుంది. దీని ప్రకారం ఆయా బస్సులు కిలోమీటర్‌కు వసూలు చేసే మొత్తం..

 • పల్లె వెలుగు – 83 పైసలు
 • సెమీ ఎక్స్‌ ప్రెస్‌లో – 95 పైసలు
 • ఎక్స్‌ప్రెస్‌ – 107 పైసలు
 • డీలక్స్‌ బస్సులు -118 పైసలు
 • సూపర్‌ లగ్జరీ, ఎక్స్‌ప్రెస్‌ -136 పైసలు
 • రాజధాని ఏసీ, వజ్ర బస్సు – 166 పైసలు
 • గరుడ ఏసీ – 191 పైసలు
 • గరుడ ప్లస్ ఏసీ – 202 పైసలు

కనీస చార్జీల పెంపుతో పాటు… అన్ని రకాల బస్సు పాస్ చార్జీలను కూడా పెంచారు.

బస్‌పాస్‌         గతం     ప్రస్తుతం

సిటీ ఆర్డీనరీ      770      950

మెట్రోపాస్‌       880     1070

మెట్రో డీలక్స్‌    990     1180

స్టూడెంట్‌ పాస్‌   130      165