Telugu Global
NEWS

నా కులం, మతంపై మాట్లాడుతున్నారు, బాధేస్తోంది.... మానవత్వమే నా మతం.... మాట నిలుపుకోవడమే నా కులం....

ప్రతిపక్ష పార్టీలు ఇటీవల పదేపదే మతం అంశాన్ని తెరపైకి తెస్తున్న నేపథ్యంలో ముఖ్యమంత్రి జగన్‌ మోహన్ రెడ్డి దీనిపై స్పందించారు. ప్రభుత్వంపై లేనిపోని ఆరోపణలు చేస్తున్నారని వ్యాఖ్యానించారు. మంచి పరిపాలన జరుగుతుంటే జీర్ణించుకోలేక ఏదిపడితే అది మాట్లాడుతున్నారని విమర్శించారు. ఇటీవల తన కులం గురించి, మతం గురించి మాట్లాడుతున్నారని… అలాంటి మాటలు విన్నప్పుడు బాధగా ఉంటుందన్నారు ముఖ్యమంత్రి. అలాంటి వారందరికీ చెబుతున్నానని… మానవత్వమే తన మతం అన్నారు ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌. మాట నిలుపుకోవడమే తన కులం […]

నా కులం, మతంపై మాట్లాడుతున్నారు, బాధేస్తోంది.... మానవత్వమే నా మతం.... మాట నిలుపుకోవడమే నా కులం....
X

ప్రతిపక్ష పార్టీలు ఇటీవల పదేపదే మతం అంశాన్ని తెరపైకి తెస్తున్న నేపథ్యంలో ముఖ్యమంత్రి జగన్‌ మోహన్ రెడ్డి దీనిపై స్పందించారు. ప్రభుత్వంపై లేనిపోని ఆరోపణలు చేస్తున్నారని వ్యాఖ్యానించారు. మంచి పరిపాలన జరుగుతుంటే జీర్ణించుకోలేక ఏదిపడితే అది మాట్లాడుతున్నారని విమర్శించారు. ఇటీవల తన కులం గురించి, మతం గురించి మాట్లాడుతున్నారని… అలాంటి మాటలు విన్నప్పుడు బాధగా ఉంటుందన్నారు ముఖ్యమంత్రి.

అలాంటి వారందరికీ చెబుతున్నానని… మానవత్వమే తన మతం అన్నారు ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌. మాట నిలుపుకోవడమే తన కులం అని వ్యాఖ్యానించారు. మేనిఫెస్టోను ఒక భగవద్గీతగా, ఖురాన్‌గా, బైబిల్‌గా భావించి దాన్ని అమలు చేస్తున్నట్టు చెప్పారు.

గుంటూరు జీజీహెచ్‌లో వైఎస్‌ఆర్ ఆరోగ్య ఆసరా కార్యక్రమాన్ని ప్రారంభించిన జగన్‌ మోహన్ రెడ్డి… ఏదైనా ఆపరేషన్ జరిగిన సమయంలో పేదవాడిని ఆదుకోవాలన్న ఉద్దేశంతోనే ఈ పథకం తీసుకొచ్చినట్టు చెప్పారు. చికిత్స సమయంలో కోలుకునే వరకు రోజుకు 225 రూపాయల చెప్పున… నెలకు 5 వేల వరకు అందిస్తామన్నారు.

వెయ్యి రూపాయలు దాటితే ఆరోగ్య శ్రీ వర్తింప చేస్తామని… పైలట్ ప్రాజెక్టుగా పశ్చిమగోదావరి జిల్లాలో తొలుత అమలు చేస్తామన్నారు. మూడు నెలల్లో రాష్ట్రం మొత్తం విస్తరిస్తామని చెప్పారు. 5లక్షల లోపు ఆదాయం ఉన్న వారికి జనవరి 1 నుంచి ఆరోగ్యశ్రీ కార్డులు అందజేస్తామన్నారు. ఆరోగ్యశ్రీ పరిధిలోకి 2వేల రోగాలను చేరుస్తున్నట్టు చెప్పారు. వచ్చే ఏప్రిల్ నాటికి 104/108 సర్వీసుల కోసం కొత్తగా 1060 అంబులెన్స్‌ను అందుబాటులోకి తెస్తామని చెప్పారు.

ఈ ఏడాది డిసెంబర్‌ 15నాటికి 510 రకాల మందులను ప్రభుత్వ ఆస్పత్రుల్లో అందుబాటులో ఉంచుతామన్నారు. WHO ప్రమాణాలతో ఉన్న మందులను ప్రజలకు అందుబాటులో ఉంచుతామన్నారు. ప్రభుత్వ ఆస్పత్రులను అపోలో ఆస్పత్రులతో పోటీ పడే స్థాయికి తీర్చిదిద్దుతామన్నారు.

First Published:  2 Dec 2019 5:56 AM GMT
Next Story