Telugu Global
NEWS

ఐపీఎల్ -2020 సీజన్ వేలానికి కౌంట్ డౌన్

971 మంది ప్లేయర్లతో డిసెంబర్ 19న వేలం 73 స్థానాల కోసం 971 మంది ప్లేయర్ల పోటీ ప్రపంచ క్రికెట్లోనే అత్యంత భాగ్యవంతమైన క్రికెట్ లీగ్ ఐపీఎల్ 2020 లీగ్ వేలానికి కౌంట్ డౌన్ ప్రారంభమయ్యింది. కోల్ కతా వేదికగా తొలిసారిగా జరుగనున్న ఈ వేలం కార్యక్రమంలో కేవలం 73 స్థానాల కోసమే దేశవిదేశాలకు చెందిన 971 మంది ఆటగాళ్లు వేలం ద్వారా తమ అదృష్టం పరీక్షించుకోబోతున్నారు. 215 మంది అంతర్జాతీయ క్రికెటర్లు, 754 మంది దేశవాళీ క్రికెటర్లను […]

ఐపీఎల్ -2020 సీజన్ వేలానికి కౌంట్ డౌన్
X
  • 971 మంది ప్లేయర్లతో డిసెంబర్ 19న వేలం
  • 73 స్థానాల కోసం 971 మంది ప్లేయర్ల పోటీ

ప్రపంచ క్రికెట్లోనే అత్యంత భాగ్యవంతమైన క్రికెట్ లీగ్ ఐపీఎల్ 2020 లీగ్ వేలానికి కౌంట్ డౌన్ ప్రారంభమయ్యింది. కోల్ కతా వేదికగా తొలిసారిగా జరుగనున్న ఈ వేలం కార్యక్రమంలో కేవలం 73 స్థానాల కోసమే దేశవిదేశాలకు చెందిన 971 మంది ఆటగాళ్లు వేలం ద్వారా తమ అదృష్టం పరీక్షించుకోబోతున్నారు.

215 మంది అంతర్జాతీయ క్రికెటర్లు, 754 మంది దేశవాళీ క్రికెటర్లను వేలంలో ఉంచాలని నిర్ణయించారు. గతం వేలం కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించిన హ్యూ ఎడ్మడోస్.. సరికొత్త సీజన్ వేలాన్ని సైతం నిర్వహించనున్నారు.

వేలంలో 19 మంది అఫ్ఘన్, 55 మంది ఆస్ట్ర్రేలియన్, ఆరుగురు బంగ్లాదేశ్, 22 మంది ఇంగ్లండ్, ఒక నెదర్లాండ్స్ క్రికెటర్, 24 మంది న్యూజిలాండ్, 54 మంది సౌతాఫ్రికా, 39 శ్రీలంక, 34 మంది వెస్టిండీస్, ముగ్గురు జింబాబ్వే, అమెరికా క్రికెటర్ ఒకరు వేలం కార్యక్రమంలో పాల్గోనున్నారు.

ప్రస్తుతం సీజన్ వేలం కోసం ఇప్పటి వరకూ తమ పేర్లను రిజిష్ట్ర్రేషన్ చేయించుకొన్నవారిలో భారత్ కు చెందిన 19 మంది అంతర్జాతీయ, 634 మంది దేశవాళీ క్రికెటర్లు ఉన్నారు.

First Published:  2 Dec 2019 8:45 PM GMT
Next Story