బాలయ్య సినిమాకు 60 కోట్లు

చిరంజీవి మినహాయిస్తే సీనియర్ హీరోలు ఎప్పుడో తమ మార్కెట్ కోల్పోయారు. నాగార్జున వరుస ఫ్లాపులతో ఇబ్బంది పడుతున్నాడు. వెంకటేష్ తన సొంత బ్యానర్ లో గుంభనంగా సినిమాలు చేసుకుంటున్నాడు. బాలయ్య తక్కువ మొత్తానికే బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తున్నాడు. ఇలాంటి టైమ్ లో ఉన్నట్టుంది తన మూవీ బడ్జెట్ ను అమాంతం పెంచేశాడు బాలయ్య. తన అప్ కమింగ్ మూవీకి ఏకంగా 60 కోట్ల బడ్జెట్ ఫిక్స్ చేశాడు.

అవును.. బోయపాటి శీను దర్శకత్వంలో బాలకృష్ణ హీరోగా రాబోతున్న సినిమాకు ఏకంగా 60 కోట్ల రూపాయల బడ్జెట్ అనుకుంటున్నారు. మామూలుగానే బోయపాటి తన సినిమాలకు భారీగా ఖర్చు చేయిస్తాడు. అలాంటిది బాలయ్యతో సినిమా అంటే ఇక ఏమాత్రం తగ్గడు. ఎందుకంటే, వీళ్లిద్దరిది హిట్ కాంబినేషన్ కదా. గతంలో సింహా, లెజెండ్ లాంటి సినిమాలొచ్చాయి.

ఇంతకుముందు బోయపాటితో జయజానకి నాయక సినిమాను నిర్మించిన మిర్యాల రవీందర్ రెడ్డి, ఈ ప్రాజెక్టును కూడా నిర్మిస్తున్నాడు. అయితే సినిమా ప్రకటించకముందు నిర్మాతకు 40 కోట్లలో తీసిపెడతానని చెప్పాడట బోయపాటి. కట్ చేస్తే, ఇప్పుడు 60 కోట్లు అంటున్నాడంటూ నిర్మాత లబోదిబోమంటున్నాడు. వెనక్కి తగ్గుదామంటే, అసలే అక్కడున్నది బాలయ్య.