మెగా మ్యూజిక్ సిట్టింగ్స్ ప్రారంభం

ఎప్పుడో 2 నెలల కిందటే ప్రారంభమైంది చిరంజీవి కొత్త సినిమా. కానీ అప్పట్నుంచి ఇప్పటివరకు ఎలాంటి చప్పుడు లేదు, సందడి లేదు. ఎట్టకేలకు చిరంజీవి తన కొత్త సినిమా పనిలో పడ్డారు. ఈ సినిమాకు మ్యూజిక్ సిట్టింగ్స్ ప్రారంభమయ్యాయి. చిరంజీవి, కొరటాల శివ, మణిశర్మ కలిసి బ్యాంకాక్ వెళ్లారు. అక్కడే సిట్టింగ్ వేశారు. కనీసం 3 ట్యూన్స్ ఫైనల్ చేయాలనేది టార్గెట్.

ట్యూన్స్ ఓకే అయిన తర్వాతే రెగ్యులర్ షూటింగ్ స్టార్ట్ చేస్తానని కండిషన్ పెట్టాడు చిరంజీవి. ఈ విషయం మణిశర్మకు కూడా తెలుసు. ఎందుకంటే గతంలో చిరంజీవితో వర్క్ చేసిన అనుభవం ఇతడికి ఉంది కాబట్టి. మణి తనకు కూడా క్లోజ్ కాబట్టి, కొరటాలతో పాటు చిరంజీవి కూడా వెళ్లారు. నిజానికి ఇలా మ్యూజిక్ సిట్టింగ్స్ లో కూర్చోవడం చిరంజీవికి కూడా ఇష్టమే. తన సినిమాలకు సంబంధించి ట్యూన్స్ ను తనే ఫైనల్ చేస్తారు.

అన్నీ అనుకున్నట్టు జరిగితే ఈనెలాఖరు నుంచి లేదా జనవరి మొదటి వారం నుంచి చిరంజీవి-కొరటాల సినిమా రెగ్యులర్ షూటింగ్ మొదలవుతుంది. ఆ తర్వాతే మిగతా విషయాల్ని బయటపెట్టాలని నిర్ణయించారు. రామ్ చరణ్, నిరంజన్ రెడ్డి కలిసి సంయుక్తంగా ఈ సినిమాను నిర్మించబోతున్నారు.