మారుతి ఈసారైనా క్లిక్ అవుతాడా?

మూవీ రిజల్ట్ సంగతి పక్కనపెడదాం. ట్రయిలర్స్ వరకు మారుతి సినిమాలు చాలా బాగుంటాయి. ట్రయిలర్ లోనే తనదైన మార్క్ చూపిస్తాడు ఈ డైరెక్టర్. మంచి థీమ్ మ్యూజిక్ ప్రజెంట్ చేస్తాడు. హీరో-హీరోయిన్ల క్యారెక్టరైజేషన్లను చక్కగా చూపిస్తాడు. మంచి కామెడీ బిట్స్ కూడా ఉంటాయి. ఓవరాల్ గా మారుతి సినిమా ట్రయిలర్స్ అన్నీ హిట్టే. మరి ప్రతి రోజూ పండగే సినిమా ట్రయిలర్ సంగతేంటి?

డిసెంబర్ 4 న ఈ సినిమా ట్రయిలర్ విడుదలకాబోతోంది. ఇది ఎలా ఉండబోతోందనే ఆసక్తి అందర్లో ఉంది. మరీ ముఖ్యంగా మారుతి మార్క్ ఉంటుందా.. ఉండదా.. అనేది పెద్ద క్వశ్చన్. రీసెంట్ గా తన వర్క్ తో పెద్దగా ఆకట్టుకోలేకపోయాడు మారుతి. ఈ సినిమాతో అతడు తన స్టయిల్ మార్చాడనే టాక్ నడుస్తోంది. ఈ నేపథ్యంలో ట్రయిలర్ కట్ పై సర్వత్రా ఆసక్తి కనిపిస్తోంది.

ఈ సినిమా హిట్ అవ్వడం మారుతికి చాలా అవసరం. ఇంతకుముందే చెప్పుకున్నట్టు అతడి గత చిత్రం శైలజారెడ్డి అల్లుడు ట్రయిలర్ కే పరిమితమైంది. సినిమా పేలవంగా ఉంది. మధ్యలో రైటర్ గా చేసిన ప్రయోగాలు కూడా బెడిసికొట్టాయి. దీంతో ప్రతిరోజూ పండగ సినిమా హిట్ అవ్వడం మారుతికి ఇప్పుడు అత్యవసరం. సినిమాకు పాజిటివ్ టాక్ రావాలంటే ఆ బజ్ ట్రయిలర్ తోనే మొదలవ్వాలి. అదీ సంగతి.