లోక్‌సభలో నిద్రపోయిన వైసీపీ ఎంపీ

లోక్‌సభలో వైసీపీ ఎంపీ నిద్రపోయారు. అది కూడా హైదరాబాద్ దిశ సంఘటనపై హాట్‌హాట్‌గా చర్చ జరుగుతున్న సమయంలో. ‘జస్టిస్ ఫర్ దిశ’ అంటూ లోక్‌సభలో సభ్యులు గళమెత్తిన వేళ వైసీపీ హిందూపురం ఎంపీ గోరంట్ల మాధవ్ కునుకు తీశారు.

మాధవ్‌కు ముందు వరుసల్లో ఉన్న ఎంపీ ఒకరు ప్రసంగిస్తున్న సమయంలోనే మాధవ్‌ కునుకు తీయడంతో ఆ దృశ్యాలు ప్రసారం అయ్యాయి. దాంతో నెటిజన్లు ట్రోల్ చేస్తున్నారు.

ఇంత సీరియస్ అంశంపై చర్చ జరుగుతుంటే ఎంపీ నిద్రపోవడం ఏమిటి అని నెటిజన్లు ఫైర్ అవుతున్నారు.

గతంలో సీఐగా కూడా పనిచేసిన మాధవ్‌… చర్చలో పాల్గొని మంచి సలహాలు ఇవ్వాల్సింది పోయి నిద్రపోవడం ఏమిటని ప్రశ్నిస్తున్నారు. మనిషికి నిద్ర రావడం సహజమని… కానీ అందుకు లోక్‌సభ మాత్రం సరైన వేదిక కాదు అని నెటిజన్లు ట్రోల్ చేస్తున్నారు.