Telugu Global
NEWS

2019 బ్యాడ్మింటన్ సీజన్లో భారత్ ఫ్లాప్ షో

బ్యాడ్మింటన్ ఫైనల్స్ కు సింధు మాత్రమే అర్హత చైనాలోని గాంగ్జావో వేదికగా డిసెంబర్ 11 నుంచి జరిగే 2019 బ్యాడ్మింటన్ సీజన్ ఆఖరి టోర్నీ, ప్రతిష్టాత్మక బ్యాడ్మింటన్ పైనల్స్ సమరానికి భారత్ కు చెందిన పీవీ సింధు మాత్రమే అర్హత సంపాదించింది. మొత్తం ఐదు విభాగాలలో కేవలం ఒక్క విభాగానికి మాత్రమే భారత్ పరిమితం కావాల్సి వచ్చింది. పురుషుల సింగిల్స్, మహిళల సింగిల్స్, మహిళల, పురుషుల డబుల్స్, మిక్సిడ్ డబుల్స్ విభాగాలలో సీజన్ ఫైనల్స్ టోర్నీనిర్వహించనున్నారు. మహిళల సింగిల్స్ లో […]

2019 బ్యాడ్మింటన్ సీజన్లో భారత్ ఫ్లాప్ షో
X
  • బ్యాడ్మింటన్ ఫైనల్స్ కు సింధు మాత్రమే అర్హత

చైనాలోని గాంగ్జావో వేదికగా డిసెంబర్ 11 నుంచి జరిగే 2019 బ్యాడ్మింటన్ సీజన్ ఆఖరి టోర్నీ, ప్రతిష్టాత్మక బ్యాడ్మింటన్ పైనల్స్ సమరానికి భారత్ కు చెందిన పీవీ సింధు మాత్రమే అర్హత సంపాదించింది.

మొత్తం ఐదు విభాగాలలో కేవలం ఒక్క విభాగానికి మాత్రమే భారత్ పరిమితం కావాల్సి వచ్చింది. పురుషుల సింగిల్స్, మహిళల సింగిల్స్, మహిళల, పురుషుల డబుల్స్, మిక్సిడ్ డబుల్స్ విభాగాలలో సీజన్ ఫైనల్స్ టోర్నీనిర్వహించనున్నారు.
మహిళల సింగిల్స్ లో ప్రపంచ చాంపియన్ పీవీ సింధు భారత్ కు ప్రాతినిథ్యం వహించనుంది.

15వ ర్యాంక్ కు పడిపోయిన సింధు…

మహిళల సింగిల్స్ లో ప్రపంచ విజేతగా నిలిచిన పీవీ సింధు ఆ తర్వాత వరుస పరాజయాలతో 15వ ర్యాంక్ కు పడిపోయింది. టూర్ ఫైనల్స్ లో ప్రపంచ మొదటి తొమ్మిది ర్యాంకుల్లో నిలిచిన వారికి మాత్రమే అవకాశం ఉంటుంది. మహిళల సింగిల్స్ విశ్వవిజేతగా నిలిచిన కారణంగా సింధు టోర్నీలో పాల్గొనటానికి అర్హత సాధించగలిగింది.

2019 సీజన్లో సింధు ప్రపంచ టైటిల్, సైనా ఇండోనీషియా టైటిల్, థాయ్ డబుల్స్ టైటిల్ ను రంకిరెడ్డి- చిరాగ్ జోడీ సాధించడం మినహా..భారత్ కు చేదుఫలితాలే ఎదురయ్యాయి. సైనా 23, రియా ముఖర్జీ 63 ర్యాంకుల్లో కొనసాగుతున్నారు.

పురుషుల సింగిల్స్ లో పారుపల్లి కశ్యప్ 16, సాయి ప్రణీత్ 17, కిడాంబీ శ్రీకాంత్ 18 ర్యాంకుల్లో కొనసాగుతున్నారు.

పురుషుల డబుల్స్ లో రంకిరెడ్డి- చిరాగ్ జోడీ 22, మహిళల డబుల్స్ లో అశ్వని-సిక్కిరెడ్డి జోడీ 21వ ర్యాంక్ లో ఉన్నారు.

First Published:  3 Dec 2019 12:08 AM GMT
Next Story