రేప్‌ చేసిన వారిని ఉరి తీసే హక్కు ఎవరికీ లేదు… బెత్తం దెబ్బలు కొట్టండి…

అమ్మాయిలపై అత్యాచారం చేస్తున్న వారికి సంబంధించి జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. రేప్‌ చేసిన వారిని చంపే హక్కు ఎవరికీ లేదని, ఆ విషయాన్ని సమాజం గుర్తించుకోవాలన్నారు.

”హైదరాబాద్‌లో రేప్‌ చేసిన నలుగురిని తీసుకెళ్లి పోలీస్ స్టేషన్ లో పెడితే వేలాది మంది వచ్చారు. ఉరి తీయాలంటున్నారు. ఒక సారి ఒక రేప్ కేసులో ఢిల్లీ స్థాయిలో ఒక జడ్జి.. రేప్‌ చేసిన వారి మర్మాంగాలు కోసేయాలన్నాడు. జడ్జికి కూడా అంత కోపం వచ్చింది. పరిస్థితి ఆ స్థాయికి ఎందుకు తీసుకెళ్తున్నారు?. ఆడపిల్ల బయటకు వెళ్లి ఇంటికి తిరిగి వచ్చే క్రమంలో ఏదైనా జరిగితే ఆ అబ్బాయిని బెత్తంతో కొట్టండి. చర్మం ఊడిపోయేలా కొట్టండి. అత్యాచారం చేసిన వారిని అందరూ చూస్తుండగానే నడిరోడ్డుపై ఉరి తీయాలంటున్నారు. ఒక మనిషిని అలా చంపే హక్కు మనకు లేదు. సమాజం ఆ విషయాన్ని కూడా తెలుసుకోవాలి” అని పవన్ కల్యాణ్ వ్యాఖ్యానించారు.