Telugu Global
NEWS

వైసీపీలో నామినేటెడ్ ప‌ద‌వుల చిచ్చు !

ఏపీలో వైసీపీ అధికారంలోకి వ‌చ్చి ఆరు నెల‌లైంది. ఇప్ప‌టికే ప‌లు నామినేటేడ్ పోస్టుల భ‌ర్తీ పూర్త‌యింది. జిల్లా స్థాయిలో నామినేటేడ్ పోస్టుల భ‌ర్తీ జ‌రుగుతోంది. ఈ ప‌ద‌వుల పందేరం విష‌యంలో ఇప్పుడు కార్య‌క‌ర్త‌ల నుంచి నిర‌స‌న స్వ‌రాలు వినిపిస్తున్నాయి. ఇన్నాళ్లు ప‌నిచేసిన వారిని ప‌క్క‌న‌పెట్టి…మ‌ధ్య‌లో వ‌చ్చిన‌వారికి…. ముఖ్యంగా బ్రోక‌ర్ల‌కు ప‌ద‌వులు ఇస్తున్నార‌ని కార్య‌క‌ర్త‌లు ఆవేద‌న వ్య‌క్తం చేస్తున్నారు. క‌ర్నూలు జిల్లాలో ఇటీవ‌లే కొన్ని నామినేటేడ్ పోస్టులు భ‌ర్తీ చేశారు. ఆంధ్ర‌ప్ర‌దేశ్ వ్య‌వ‌సాయ విద్యాల‌యం పాల‌క‌మండ‌లి వ‌ర్గ స‌భ్యుడిగా […]

వైసీపీలో నామినేటెడ్ ప‌ద‌వుల చిచ్చు !
X

ఏపీలో వైసీపీ అధికారంలోకి వ‌చ్చి ఆరు నెల‌లైంది. ఇప్ప‌టికే ప‌లు నామినేటేడ్ పోస్టుల భ‌ర్తీ పూర్త‌యింది. జిల్లా స్థాయిలో నామినేటేడ్ పోస్టుల భ‌ర్తీ జ‌రుగుతోంది. ఈ ప‌ద‌వుల పందేరం విష‌యంలో ఇప్పుడు కార్య‌క‌ర్త‌ల నుంచి నిర‌స‌న స్వ‌రాలు వినిపిస్తున్నాయి. ఇన్నాళ్లు ప‌నిచేసిన వారిని ప‌క్క‌న‌పెట్టి…మ‌ధ్య‌లో వ‌చ్చిన‌వారికి…. ముఖ్యంగా బ్రోక‌ర్ల‌కు ప‌ద‌వులు ఇస్తున్నార‌ని కార్య‌క‌ర్త‌లు ఆవేద‌న వ్య‌క్తం చేస్తున్నారు.

క‌ర్నూలు జిల్లాలో ఇటీవ‌లే కొన్ని నామినేటేడ్ పోస్టులు భ‌ర్తీ చేశారు. ఆంధ్ర‌ప్ర‌దేశ్ వ్య‌వ‌సాయ విద్యాల‌యం పాల‌క‌మండ‌లి వ‌ర్గ స‌భ్యుడిగా నంద్యాల‌కు చెందిన పారిశ్రామిక వేత్త రామ్మోహన్ రెడ్డిని నియ‌మించారు. ఈయ‌న‌కు పోస్టు ఇవ్వ‌డంపై ఇప్పుడు క‌ర్నూలు జిల్లా వైసీపీలో ర‌చ్చ న‌డుస్తోంది. ఈయ‌న పార్టీకి చేసిందేమి లేద‌ని…కేవ‌లం నాయ‌కులతో సంబంధాలు ఉంటే ప‌ద‌వులు ఇస్తారా అని కార్య‌క‌ర్త‌లు నిల‌దీస్తున్నారు

రామ్మోహన్ రెడ్డి మాజీ ఎంపీ ఎస్పీవైరెడ్డి అన్న చుట్ట‌రెడ్డి అల్లుడు. ఈయ‌న ఏ ఎన్నిక‌ల్లో వైసీపీకి స‌పోర్టు చేయ‌లేదు. 2004 ఎన్నిక‌ల్లో ఈయ‌న ఎస్పీవైరెడ్డికి స‌పోర్టు చేయ‌లేదు. 2009లో ప్ర‌జారాజ్యంలో చేరాడు. ఆ పార్టీ అధికార ప్ర‌తినిధిగా వైఎస్‌పై ఆరోప‌ణ‌లు చేశాడు.

ఇక 2014, 2019 ఎన్నికల్లో ఎక్కడా ఒకరోజు ప్రచారంలో కానీ, జెండా కట్టి తిరగటం ఎవరూ చూడలేదు. బ్యాంకులు, ఇతర సంస్థలకు అప్పులు ఎగొట్టి కోర్ట్ కేసుల్లో ఉన్నాడు… అధికారుల అండతో భూ కబ్జాలు చేసిన కేసులు కోర్టుల్లో ఉన్నాయి. ఇక కొన్ని వందల మందిని ఆర్ధికంగా ముంచిన ఘన చరిత్ర ఈయ‌న‌ది. ఇలాంటి వ్య‌క్తికి ఇప్పుడు ప‌ద‌వి ఎలా ఇస్తార‌నేది నంద్యాల వైసీపీ నేత‌ల ప్ర‌శ్న‌.

మ‌రోవైపు మొద‌టి నుంచి వైసీపీ జెండా మోసిన ఎస్పీవైరెడ్డి మేన‌ల్లుడు రాజ‌గోపాల్‌రెడ్డికి ఇప్ప‌టివ‌ర‌కూ ఏ ప‌ద‌వి ఇవ్వ‌క‌పోవ‌డంపై కార్య‌క‌ర్త‌లు అస‌హ‌నం వ్య‌క్తం చేస్తున్నారు. డాక్ట‌ర్‌గా లోక‌ల్‌గా మంచిపేరున్న రాజ‌గోపాల్‌రెడ్డిని ప‌క్క‌న‌పెట్ట‌డంపై ఇక్క‌డ చ‌ర్చ జరుగుతోంది.

ప్రభుత్వమన్నాక నియమాకాలలో కొన్ని ఒత్తిడులు ఉండటం సహజమే అని ఇప్పటి వరకు అనుకున్నాము కానీ గత వారం రోజుల్లో జరిగిన కొన్ని నియామకాలు చూస్తే ఆశ్చ‌ర్య‌మేస్తుంద‌ని పార్టీ నేత‌లు కొంద‌రు అంటున్నారు.

నంద్యాల ఉప ఎన్నికలప్పుడు రెండు వారాలు అక్కడే ఉన్న జగన్ ఈ రామ్మోహన్ రెడ్డి ని గుర్తుపడతాడా? ఎమ్మెల్యే నో మరొకరో రెకమెండ్ చేసినంత మాత్రాన ఎవరికంటే వారికి పదవులు ఇవ్వటమేనా? నంద్యాలలో మొదటి పదవి రాజగోపాల్ రెడ్డి కి దక్కాలి. సరే ఆయనకు ఇవ్వలేదు కష్టపడ్డ మరొకరికి ఇవ్వాలి.

ఈ రామ్మోహన్ రెడ్డి ఏమి కష్టపడ్డాడని పదవి? ఈయన పారిశ్రామిక వేత్తనా? ఏ పరిశ్రమ పెట్టాడు? ఏమి వ్యాపారం చేసాడు? అని ప‌ద‌వులు ఇచ్చార‌ని వైసీపీ నేత‌లు ప్ర‌శ్నిస్తున్నారు.

First Published:  3 Dec 2019 12:10 AM GMT
Next Story