Telugu Global
NEWS

భారత టేబుల్ టెన్నిస్ లో సరికొత్త చరిత్ర

9వ ర్యాంక్ లో నిలిచిన భారత పురుషుల జట్టు భారత టేబుల్ టెన్నిస్ చరిత్రలో సరికొత్త అధ్యాయానికి తెరలేచింది. గతంలో ఎన్నడూ లేనంతగా భారతపురుషుల జట్టు..అత్యుత్తమంగా ప్రపంచ 8వ ర్యాంక్ సాధించడం ద్వారా సంచలనం సృష్టించింది. అంతర్జాతీయ టేబుల్ టెన్నిస్ సమాఖ్య తాజా ర్యాంకింగ్స్ ప్రకారం చైనా, జపాన్,జర్మనీ మొదటి మూడు ర్యాంకుల్లో కొనసాగుతున్నాయి. గత నెల ర్యాంకింగ్స్ 9వ స్థానంలో నిలిచిన భారత పురుషుల జట్టు…డిసెంబర్ ర్యాంకింగ్స్ ప్రకారం 8వ ర్యాంక్ కు చేరుకోగలిగింది. కామన్వెల్త్ […]

భారత టేబుల్ టెన్నిస్ లో సరికొత్త చరిత్ర
X
  • 9వ ర్యాంక్ లో నిలిచిన భారత పురుషుల జట్టు

భారత టేబుల్ టెన్నిస్ చరిత్రలో సరికొత్త అధ్యాయానికి తెరలేచింది. గతంలో ఎన్నడూ లేనంతగా భారతపురుషుల జట్టు..అత్యుత్తమంగా ప్రపంచ 8వ ర్యాంక్ సాధించడం ద్వారా సంచలనం సృష్టించింది.

అంతర్జాతీయ టేబుల్ టెన్నిస్ సమాఖ్య తాజా ర్యాంకింగ్స్ ప్రకారం చైనా, జపాన్,జర్మనీ మొదటి మూడు ర్యాంకుల్లో కొనసాగుతున్నాయి. గత నెల ర్యాంకింగ్స్ 9వ స్థానంలో నిలిచిన భారత పురుషుల జట్టు…డిసెంబర్ ర్యాంకింగ్స్ ప్రకారం 8వ ర్యాంక్ కు చేరుకోగలిగింది.

కామన్వెల్త్ గేమ్స్, ఆసియాక్రీడల్లో భారత క్రీడాకారులు, జట్లు మెరుగైన ఆటతీరు ప్రదర్శించడంతో ర్యాంకింగ్ గణనీయంగా మెరుగుపడింది.

భారత ఆటగాళ్లలో సత్యన్ 30, శరత్ కమల్ 36, హర్మీత్ దేశాయ్ 104 ర్యాంకుల్లో ఉన్నారు.

భారత్, ఆస్ట్ర్రియా జట్లు చెరో 272 పాయింట్ల చొప్పున సాధించి సమానస్థితిలో ఉన్నా..సత్యన్, శరత్ కమల్ వ్యక్తిగతంగా మొదటి 40 ర్యాంకుల్లో నిలవడంతో…భారత్ 8, ఆస్ట్ర్రియా 10 ర్యాంకుల్లో ఉన్నట్లు ప్రకటించారు.

గత ఏడాది 13వ ర్యాంక్ లో నిలిచిన భారతజట్టు…కేవలం ఏడాదికాలంలోనే ఐదుర్యాంకుల మేర మెరుగుపరచుకోగలిగింది.

First Published:  3 Dec 2019 8:50 PM GMT
Next Story