Telugu Global
NEWS

విండీస్ తో తొలి టీ-20 కి హైదరాబాద్ రెడీ

డిసెంబర్ 6న తొలి టీ-20 ఫైట్ ప్రపంచకప్ కు సన్నాహకంగా డిసెంబర్ 6 నుంచి వెస్టిండీస్ తో జరిగే మూడు మ్యాచ్ ల టీ-20 సిరీస్ లోని తొలిమ్యాచ్ కు హైదరాబాద్ రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ స్టేడియం ముస్తాబవుతోంది. చాలాకాలం విరామం తర్వాత హైదరాబాద్ ఓ అంతర్జాతీయ టీ-20 మ్యాచ్ కు వేదికకానుంది. భువీ బ్యాక్….. ఫిట్ నెస్ సమస్యలతో గత కొంతకాలంగా భారతజట్టుకు దూరంగా ఉన్నస్వింగ్ బౌలర్ భువనేశ్వర్ కుమార్ కు తిరిగి టీ-20 జట్టులో […]

విండీస్ తో తొలి టీ-20 కి హైదరాబాద్ రెడీ
X
  • డిసెంబర్ 6న తొలి టీ-20 ఫైట్

ప్రపంచకప్ కు సన్నాహకంగా డిసెంబర్ 6 నుంచి వెస్టిండీస్ తో జరిగే మూడు మ్యాచ్ ల టీ-20 సిరీస్ లోని తొలిమ్యాచ్ కు హైదరాబాద్ రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ స్టేడియం ముస్తాబవుతోంది. చాలాకాలం విరామం తర్వాత హైదరాబాద్ ఓ అంతర్జాతీయ టీ-20 మ్యాచ్ కు వేదికకానుంది.

భువీ బ్యాక్…..

ఫిట్ నెస్ సమస్యలతో గత కొంతకాలంగా భారతజట్టుకు దూరంగా ఉన్నస్వింగ్ బౌలర్ భువనేశ్వర్ కుమార్ కు తిరిగి టీ-20 జట్టులో చోటు దక్కించుకొన్నాడు.

సూపర్ ఫామ్ లో ఉన్న ఫాస్ట్ బౌలర్ మహ్మద్ షమీనిసైతం టీ-20 జట్టులో చేర్చారు.

ముంబై ఆల్ రౌండర్ శివం దూబేకు వన్డే సిరీస్ లో ఆడే అవకాశం కల్పించారు. రెండు ఫార్మాట్లలోనూ భారతజట్లకు విరాట్ కొహ్లీనే నాయకత్వం వహించనున్నాడు.

ముంబైకి బదులు హైదరాబాద్ లో ….

వాస్తవానికి తొలి టీ-20 మ్యాచ్ ముంబై వేదికగా జరగాల్సి ఉంది. అయితే…ముంబైకి బదులుగా హైదరాబాద్ లో నిర్వహించాలని బీసీసీఐ నిర్ణయించింది.

డిసెంబర్ 6న ప్రారంభమయ్యే టీ-20 సిరీస్ లోని తొలిమ్యాచ్ కు హైదరాబాద్ రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ స్టేడియం వేదికగా నిలువనుంది. సిరీస్ లోని రెండో మ్యాచ్ ను డిసెంబర్ 8న తిరువనంతపురంలోనూ, 11న ఆఖరి టీ-20 మ్యాచ్ ను ముంబై వాంఖెడీ స్టేడియంలోనూ నిర్వహిస్తారు.

15 నుంచి వన్డే సిరీస్…

డిసెంబర్ 15న ప్రారంభమయ్యే వన్డే సిరీస్ లోని తొలిమ్యాచ్ కు చెన్నై చెపాక్ స్టేడియం ఆతిథ్యమిస్తుంది. 18న విశాఖలో రెండు, కటక్ లో డిసెంబర్ 22న మూడు వన్డేలు నిర్వహించనున్నారు.

ఇదీ వన్డే జట్టు…

విరాట్ కొహ్లీ, రోహిత్ శర్మ, శిఖర్ ధావన్, కేదార్ జాదవ్, రాహుల్, రిషభ్ పంత్, మనీష్ పాండే, శ్రేయస్ అయ్యర్, రవీంద్ర జడేజా, శివం దూబే, యజువేంద్ర చహాల్, కుల్దీబ్ యాదవ్, మహ్మద్ షమీ, దీపక్ చహార్.

టీ-20 జట్టు…

విరాట్ కొహ్లీ ( కెప్టెన్), రోహిత్ శర్మ, రాహుల్, శిఖర్ ధావన్, రిషభ్ పంత్, మనీశ్ పాండే, శ్రేయస్ అయ్యర్, శివం దూబే, రవీంద్ర జడేజా, వాషింగ్టన్ సుందర్, యజువేంద్ర చహాల్, కుల్దీప్ యాదవ్,దీపక్ చహార్, భువనేశ్వర్ కుమార్, మహ్మద్ షమీ. విండీస్ జట్లకు బిగ్ ఆల్ రౌండర్ కిరాన్ పోలార్డ్ నాయకత్వం వహించనున్నాడు.

First Published:  3 Dec 2019 11:38 PM GMT
Next Story