Telugu Global
NEWS

జేసీ అనుచరుడిపై బహిష్కరణ వేటు

అనంతపురం జిల్లాలో సంఘవిద్రోహక శక్తులపై పోలీసులు ఉక్కుపాదం మోపుతున్నారు. ప్రజల్లో అలజడులకు, దాడులకు కారణమవుతున్న వారిపై కఠినంగా వ్యవహరిస్తున్నారు. తాడిపత్రిని జేసీ కుటుంబం అండతో పాతికేళ్లుగా శాసిస్తున్న జేసీ ప్రభాకర్ రెడ్డి ముఖ్య అనుచరుడు ఎస్‌వీ రవీంద్రారెడ్డిపై జిల్లా బహిష్కరణకు పోలీసులు రంగం సిద్ధం చేశారు. మరోరెండు రోజుల్లో ఇందుకు సంబంధించిన ఆదేశాలు రాబోతున్నాయి. సంగటి రవీంద్రారెడ్డి అలియాస్ పొట్టి రవి 2003లో జేసీ కుటుంబం చెంతకు చేరాడు. నమ్మిన బంటుగా మారాడు. దాడులు, దౌర్జన్యాల విషయంలో […]

జేసీ అనుచరుడిపై బహిష్కరణ వేటు
X

అనంతపురం జిల్లాలో సంఘవిద్రోహక శక్తులపై పోలీసులు ఉక్కుపాదం మోపుతున్నారు. ప్రజల్లో అలజడులకు, దాడులకు కారణమవుతున్న వారిపై కఠినంగా వ్యవహరిస్తున్నారు. తాడిపత్రిని జేసీ కుటుంబం అండతో పాతికేళ్లుగా శాసిస్తున్న జేసీ ప్రభాకర్ రెడ్డి ముఖ్య అనుచరుడు ఎస్‌వీ రవీంద్రారెడ్డిపై జిల్లా బహిష్కరణకు పోలీసులు రంగం సిద్ధం చేశారు. మరోరెండు రోజుల్లో ఇందుకు సంబంధించిన ఆదేశాలు రాబోతున్నాయి.

సంగటి రవీంద్రారెడ్డి అలియాస్ పొట్టి రవి 2003లో జేసీ కుటుంబం చెంతకు చేరాడు. నమ్మిన బంటుగా మారాడు. దాడులు, దౌర్జన్యాల విషయంలో జేసీ వర్గానికి పొట్టి రవినే నాయకత్వం వహిస్తుంటాడు. హత్యాయత్నాలు, దొమ్మిలు, మారణాయుధులు కలిగి ఉండడం వంటి వ్యవహారాల్లో పొట్టి రవిపై 11 కేసులు ఉన్నాయి.

2015లో అల్ట్రాటెక్ట్‌ సిమెంట్‌ పరిశ్రమలో సామగ్రిని ధ్వంసం చేసిన కేసు, 2017లో తాడిపత్రి మండలం, పెద్దపొలమడ గ్రామం సమీపంలోని ప్రభోదానంద ఆశ్రమానికి చెందిన వాటర్‌ ట్యాంక్‌ దగ్ధం కేసులో రవీంద్రారెడ్డి నిందితుడిగా ఉన్నాడు.

2018లో వినాయక చవితి నిమజ్జన సందర్భంగా చేలరేగిన ఘర్షణలో కేసులు రవిపై నమోదు అయ్యాయి. కొద్ది రోజుల క్రితమే అనిల్ కుమార్ రెడ్డి అనే వ్యక్తిని హత్య చేసేందుకు పొట్టి రవి ప్లాన్ చేయగా పోలీసులు ఆ ప్రయత్నాన్ని భగ్నం చేశారు.

జేసీ కుటుంబం అండ ఉండడంతో ఇంతకాలం పొట్టి రవి జోలికి పోలీసులు వెళ్లలేకపోయారు. తాడిపత్రిలో శాంతిభద్రతలకు పొట్టి రవి విఘాతం కలిగిస్తున్నారన్న నిర్దారణకు వచ్చిన పోలీసులు అతడిని జిల్లా నుంచి బహిష్కరించేందుకు సిద్ధమయ్యారు. ఇప్పటికే ఇతడిపై పీడీ యాక్ట్ కూడా ప్రయోగించారు.

First Published:  3 Dec 2019 11:50 PM GMT
Next Story