ఈ టైంలో రిసెప్షన్‌కు వస్తారా? కేసీఆర్‌పై జాతీయా మీడియా ధ్వజం

ఢిల్లీ వెళ్లిన తెలంగాణ సీఎం కేసీఆర్‌కు చేదు అనుభవం ఎదురైంది. ఢిల్లీలో ఒక వివాహ రిసెప్షన్‌కి హజరయ్యేందుకు వెళ్తున్న సమయంలో సీఎం కేసీఆర్‌ను ఢిల్లీలో జాతీయ మీడియా ప్రతినిధులు చుట్టుముట్టారు. దిశ ఘటనపై సమాధానం చెప్పాలంటూ అడ్డుకున్నారు. కేసీఆర్‌ మాత్రం స్పందించలేదు. మీడియా ప్రతినిధులను దాటుకుని వెళ్లి తన కాన్వాయ్‌లో ఎక్కి వెళ్లిపోయారు.

కేసీఆర్‌ తీరుపై జాతీయ మీడియా ప్రతికూలంగా స్పందిస్తోంది. దిశ ఘటనపై కనీసం స్పందించేందుకు కూడా ఎందుకు ఇష్టపడడం లేదంటూ కేసీఆర్‌ తీరును ప్రశ్నిస్తోంది. ఒకవైపు దిశ ఘటన దేశాన్ని కుదిపేస్తుంటే కేసీఆర్‌ మాత్రం ఓ విలాసవంతమైన వివాహ కార్యక్రమానికి వచ్చారంటూ జాతీయ మీడియా విమర్శిస్తూ కథనాలు ప్రసారం చేస్తోంది.

దిశ కుటుంబాన్ని పరామర్శించే సమయం లేదు గానీ… ఢిల్లీలో రిసెప్షన్‌కు మాత్రం తీరిక ఉందా అంటూ మీడియా ప్రశ్నిస్తోంది.