కేంద్రం దక్షిణాదిపై వివక్ష చూపుతోంది…

కేంద్ర ప్రభుత్వంపై మంత్రి కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. దక్షిణాది రాష్ట్రాల పట్ల కేంద్ర ప్రభుత్వం వివక్ష చూపుతోందని విమర్శించారు. తెలంగాణ రాష్ట్రాన్ని కూడా కేంద్రం నిర్లక్ష్యం చేస్తోందన్నారు. తెలంగాణతో పాటు… దక్షిణాదిలో చాలా ప్రాజెక్టులు పెండింగ్‌లోనే ఉన్నాయన్నారు. తెలంగాణకు రావాల్సిన ప్రాజెక్టులు రానివ్వడం లేదన్నారు.

అభివృద్ధి కేవలం నాగపూర్‌కేనా? అని కేటీఆర్ ప్రశ్నించారు. హైదరాబాద్‌, బెంగళూరు విషయంలో నిర్లక్ష్యపూరితంగా కేంద్రం వైఖరి ఉందన్నారు. రాజకీయ కారణాలతో తెలంగాణను కేంద్రం పట్టించుకోవడం లేదన్నారు.

హైదరాబాద్‌లో సీఐఐ ఆధ్వర్యంలో జరిగిన డిఫెన్స్ కాంక్లేవ్‌ కార్యక్రమంలో పాల్గొన్న కేటీఆర్… డిఫెన్స్‌ రంగానికి అత్యంత అనువైన ప్రాంతంగా తెలంగాణ ఉందని… కానీ కేంద్ర ప్రభుత్వం రాజకీయ అవసరాల కోసం ప్రాజెక్టులను ఇతర రాష్ట్రాలకు తరలిస్తోందని కేటీఆర్ విమర్శించారు.