ప్రపంచ అత్యుత్తమ ఫుట్ బాల్ ప్లేయర్ గా మెస్సీ

  • ఆరోసారి వరల్డ్ బెస్ట్ గా అర్జెంటీనా స్టార్

అర్జెంటీనా సాకర్ దిగ్గజం లయనల్ మెస్సీ ఆరోసారి ప్రపంచ అత్యుత్తమ ఫుట్ బాల్ ప్లేయర్ అవార్డు అందుకొన్నాడు. 32 సంవత్సరాల మెస్సీ..ప్రపంచ అత్యుత్తమ సాకర్ ప్లేయర్ కు ఇచ్చే బాలన్ డీ ఓర్ అవార్డుకు ఎంపిక కావడం ఇది ఆరోసారి.

పారిస్ లో ముగిసిన ప్రపంచ ఫుట్ బాల్ సమాఖ్య అవార్డుల ప్రదాన కార్యక్రమంలో మెస్సీ ఈ పురస్కారం స్వీకరించాడు.

మెస్సీ ప్రధాన ప్రత్యర్థి, పోర్చుగల్ స్టార్ క్రిస్టియానో రొనాల్డో ఇప్పటి వరకూ ఐదుసార్లు మాత్రమే ప్రపంచ అత్యుత్తమ ఫుట్ బాల్ ప్లేయర్ గౌరవాన్ని సంపాదించగలిగాడు.

రిటైర్మెంట్ ఆలోచనలో మెస్సీ…

అవిశ్రాంతంగా ఫుట్ బాల్ ఆడటంతో తనకు రిటైర్మెంట్ సమయం వచ్చినట్లుగా అనిపిస్తోందని…అయితే తన ఫిట్ నెస్ ను ఎప్పటికప్పుడు బేరీజు వేసుకొంటూ కెరియర్ ను కొనసాగించనున్నట్లు మెస్సీ ప్రకటించాడు.

యూరోపియన్ సాకర్ లీగ్ లో బార్సిలోనా క్లబ్ కు ఆడుతున్న లయనల్ మెస్సీ…అర్జెంటీనా జాతీయజట్టుకు సైతం నాయకత్వం వహిస్తున్నాడు.