గీతాఆర్ట్స్ బ్యానర్ లో నిఖిల్

గీతాఆర్ట్స్ బ్యానర్ లో త్వరలోనే ఓ సినిమా చేస్తానంటూ ఈమధ్యే ప్రకటించాడు నిఖిల్. ఇప్పుడా సినిమాకు సంబంధించి అధికారిక ప్రకటన వచ్చింది. కాకపోతే అంతా అనుకుంటున్నట్టు మామూలుగా లేదు ఈ ప్రాజెక్టు. కాస్త వెరైటీగా ఉంది. అవును.. ఈసారి ఈ జనాలతో పాటు సుకుమార్ కూడా కలిశాడు.

గీతాఆర్ట్స్-2 బ్యానర్ పై అల్లు అరవింద్ సమర్పకుడిగా, బన్నీ వాస్ నిర్మాతగా, నిఖిల్ హీరోగా ఓ సినిమా రాబోతోంది. ఈ ప్రాజెక్టుకు సూర్యప్రతాప్ (కుమారి 21 ఎఫ్) దర్శకుడు. వీళ్లతో పాటు జాయిన్ అయ్యాడు సుకుమార్. అవును.. ఈ సినిమాకు కథ, స్క్రీన్ ప్లే అందిస్తున్నాడు సుక్కూ. పైగా రెమ్యూనరేషన్ కూడా తీసుకోవడం లేదు. సహ-నిర్మాతగా వ్యవహరిస్తున్నాడు. అంటే లాభాల్లో షేర్ అన్నమాట.

జనవరిలో ఈ సినిమా ప్రారంభమౌతుంది. అదే నెలలో లేదా ఫిబ్రవరి మొదటి వారం నుంచి సెట్స్ పైకి వస్తుంది. ఈ గ్యాప్ లో కార్తికేయ-2 సినిమాకు సంబంధించి ఓ షెడ్యూల్ పూర్తిచేస్తాడు నిఖిల్.