Telugu Global
National

నిత్యానంద దేశం... ప్రత్యేకతలు ఇవే...

వివాదాస్పద స్వామిజీ నిత్యానంద మరోవారి వార్తల్లోకి ఎక్కారు. ఆయన ప్రత్యేకంగా ఒక దేశాన్ని స్థాపించుకున్నారు. ఈక్వెడార్‌ నుంచి ఒక చిన్న దీవిని కొనుగులు చేసి దాన్ని ప్రత్యేక దేశంగా ప్రకటించుకున్నారు. కైలాస అని ఆ దేశానికి పేరు పెట్టారు. తమ దేశాన్ని గుర్తించాలంటూ ఐక్యరాజ్యసమితికి విజ్ఞప్తి చేయబోతున్నారు. కైలాస దేశానికి సంబంధించి వెబ్‌సైట్‌ కూడా నడుస్తోంది. అక్కడ ఇప్పటికే నిత్యానంద ఒక ప్రభుత్వాన్ని కూడా ఏర్పాటు చేశాడు. ప్రధానిని, మంత్రులను నియమించారు. గోల్డ్, రెడ్ కలర్‌లో పాస్‌పోర్టులను […]

నిత్యానంద దేశం... ప్రత్యేకతలు ఇవే...
X

వివాదాస్పద స్వామిజీ నిత్యానంద మరోవారి వార్తల్లోకి ఎక్కారు. ఆయన ప్రత్యేకంగా ఒక దేశాన్ని స్థాపించుకున్నారు. ఈక్వెడార్‌ నుంచి ఒక చిన్న దీవిని కొనుగులు చేసి దాన్ని ప్రత్యేక దేశంగా ప్రకటించుకున్నారు. కైలాస అని ఆ దేశానికి పేరు పెట్టారు. తమ దేశాన్ని గుర్తించాలంటూ ఐక్యరాజ్యసమితికి విజ్ఞప్తి చేయబోతున్నారు.

కైలాస దేశానికి సంబంధించి వెబ్‌సైట్‌ కూడా నడుస్తోంది. అక్కడ ఇప్పటికే నిత్యానంద ఒక ప్రభుత్వాన్ని కూడా ఏర్పాటు చేశాడు. ప్రధానిని, మంత్రులను నియమించారు. గోల్డ్, రెడ్ కలర్‌లో పాస్‌పోర్టులను కూడా రూపొందించారు. హిందుత్వాన్ని ప్రచారం చేస్తున్న తమ జీవితం భారత దేశంలో ప్రమాదంలో పడిందని…. అందుకే ప్రత్యేక దేశాన్ని ఏర్పాటు చేసుకున్నామని ఐక్యరాజ్య సమితికి రాసేందుకు సిద్ధం చేసిన లేఖలో నిత్యానంద వెల్లడించారు.

తమ దేశంలో నివాసం ఉండేందుకు ఆహ్వానం కూడా పలికారు నిత్యానంద. తమ దేశంలో నివాసం ఉండేందుకు విరాళాలు ఇవ్వాలని కూడా కోరారు. తమది రాజకీయేతర హిందూ దేశమని , హిందుత్వ పునరుద్దరణకు కృషి చేస్తుందని ప్రకటించారు. సింహాసనంపై నిత్యానంద కూర్చున్న బొమ్మకు పక్కన నంది బొమ్మతో ఆ దేశ జెండాను రూపొందించారు. తన ప్రభుత్వంలో పది శాఖలను ఏర్పాటు చేశారు. నిత్యానంద స్వామి కార్యాలయం, రక్షణ, విదేశీ వ్యవహారాలు, సోషల్ మీడియా, విద్య తదితర శాఖలను ఏర్పాటు చేశారు.

తన కైలాస దేశంలో ఉచితంగా భోజనం, విద్యా, వైద్యం అందిస్తామని నిత్యానంద ప్రభుత్వం ప్రకటించింది. ఏ దేశ ఆధిపత్యం కింద లేని తాము ఇతర దేశాలతో, అంతర్జాతీయ సంస్థలతో సంబంధాలు ఏర్పాటు చేసుకుంటామని కైలాస వైబ్‌సైట్‌లో వివరించారు. అత్యాచార ఆరోపణలు ఎదుర్కొంటున్న నిత్యానంద కొద్ది రోజుల క్రితమే భారత్‌ నుంచి నేపాల్ మీదుగా పారిపోయారు.

First Published:  3 Dec 2019 11:40 PM GMT
Next Story