Telugu Global
NEWS

శాప్ గేమ్స్ వాలీబాల్ లో భారత్ కు డబుల్ గోల్డ్

పురుషుల ఫైనల్లో పాక్ పై భారత్ గెలుపు నేపాల్ వేదికగా జరుగుతున్న 2019 దక్షిణాసియా క్రీడల వాలీబాల్ పురుషుల, మహిళల విభాగాలలో భారత్ బంగారు పతకాలు గెలుచుకొంది. ఖాట్మండూ ఇండోర్ స్టేడియం వేదికగా జరిగిన బంగారు పతకం పోటీలలో భారత పురుషులజట్టు పాక్ పైన, మహిళల జట్టు నేపాల్ పైన విజయాలు సాధించాయి. దశరథ స్టేడియం వేదికగా జరిగిన పురుషుల ఫైనల్లో భారత్ 3-1తో పాక్ ను చిత్తు చేసింది. తొలిసెట్ ను 20-25తో చేజార్చుకొన్న భారత్ ఆ తర్వాతి […]

శాప్ గేమ్స్ వాలీబాల్ లో భారత్ కు డబుల్ గోల్డ్
X
  • పురుషుల ఫైనల్లో పాక్ పై భారత్ గెలుపు

నేపాల్ వేదికగా జరుగుతున్న 2019 దక్షిణాసియా క్రీడల వాలీబాల్ పురుషుల, మహిళల విభాగాలలో భారత్ బంగారు పతకాలు గెలుచుకొంది. ఖాట్మండూ ఇండోర్ స్టేడియం వేదికగా జరిగిన బంగారు పతకం పోటీలలో భారత పురుషులజట్టు పాక్ పైన, మహిళల జట్టు నేపాల్ పైన విజయాలు సాధించాయి.

దశరథ స్టేడియం వేదికగా జరిగిన పురుషుల ఫైనల్లో భారత్ 3-1తో పాక్ ను చిత్తు చేసింది. తొలిసెట్ ను 20-25తో చేజార్చుకొన్న భారత్ ఆ తర్వాతి మూడుసెట్లలోనూ 25-15, 25-21, 25-9తో పాక్ ను చిత్తు చేసి బంగారు పతకం అందుకోగలిగింది.

ఏకపక్షంగా సాగిన మహిళల గోల్డ్ మెడల్ మ్యాచ్ లో భారత్ కు ఆతిథ్య నేపాల్ నుంచి పోటీనే లేకుండా పోయింది. శాఫ్ గేమ్స్ మహిళల వాలీబాల్ లో నేపాల్ రజత పతకం గెలుచుకోడం ఇదే మొదటిసారి.

డిసెంబర్ 10 వరకూ నేపాల్ నగరాలు ఖాట్మండూ, ఫోక్రాలు వేదికగా జరిగే ఈ క్రీడల్లో భాగంగా 27 అంశాలలో దక్షిణాసియాకు చెందిన 7 దేశాలజట్ల క్రీడాకారులు పోటీపడుతున్నారు.

First Published:  3 Dec 2019 8:58 PM GMT
Next Story