నాని కొత్త సినిమా పేరు ఇదే

టక్ జగదీష్.. వినడానికి, చెప్పుకోడానికి కాస్త కొత్తగా ఉంది. కానీ ఈ టైటిల్ బాగానే వైరల్ అయింది. చొక్కాని లోపలకు మడిచి ఇన్-షర్ట్ చేస్తే దాన్ని చాలా ప్రాంతాల్లో టక్ అంటారనే విషయం తెలిసిందే. దీన్నే టైటిల్ గా తీసుకున్నాడు దర్శకుడు శివ నిర్వాణ. సినిమాలో నాని పాత్ర పేరు జగదీష్. అందుకే టక్ జగదీష్ అనే పేరు పెట్టాడు.

ఇలా క్యారెక్టర్ పేరుమీదే టైటిల్ ఎనౌన్స్ చేయడంతో మూవీపై ఇంకాస్త ఇంట్రెస్ట్ పెరిగింది. ఎందుకంటే, శివ నిర్వాణ గత రెండు సినిమాలు (నిన్ను కోరి, మజిలీ) హీరో చుట్టూ తిరగవు. అవి కేవలం మంచి కథలు మాత్రమే. హీరోలు వాటిని పండించారు. కానీ ఈసారి హీరో క్యారెక్టరైజేషన్ చుట్టూ కథ అల్లుకున్నట్టున్నాడు నిర్వాణ. అందుకే ఈ డిఫరెంట్ టైటిల్ పెట్టాడు.

సినిమాలో నాని సరసన రీతు వర్మ హీరోయిన్ గా నటించనుంది. ఐశ్వర్యరాజేష్ సెకెండ్ హీరోయిన్ గా కనిపించనుంది. తమన్ ఈ సినిమాకు సంగీతం అందించబోతున్నాడు. షైన్ స్క్రీన్ పిక్చర్స్ బ్యానర్ పై జనవరి నుంచి ఈ సినిమా సెట్స్ పైకి రాబోతోంది.