వెంకటేష్ కామెడీ మాములుగా లేదుగా

“దేవుడా.. ఓ మంచి దేవుడా.. చాలా థ్యాంక్స్ దేవుడా.. ఫైనల్ గా డిసెంబర్ 13న సినిమా వస్తోంది. చాలా రోజుల నుంచి వెయిట్ చేస్తున్నాను దేవుడా.. ఎప్పుడూ ఇంత టెన్షన్ లేదు. వెంకీ మామ అన్నారు.. మిలట్రీ నాయుడు అన్నారు… రిలీజ్ కు మాత్రం చాలా రోజులు తీసుకున్నారు. థ్యాంక్యూ సురేష్ ప్రొడక్షన్స్, థ్యాంక్యూ అన్నయ్య.”

ఈ మాటలన్నది ఎవరో కాదు, స్వయంగా వెంకటేష్ ఈ డైలాగ్స్ అన్నారు. ఏకంగా సురేష్ ప్రొడక్షన్స్ బ్యానర్ పైన, తన అన్న సురేష్ బాబు పైన ఇలా నిండు సభలో సెటైర్లు వేశారు వెంకటేశ్. ఈ సినిమా విడుదలపై కొన్నాళ్లుగా రచ్చ నడుస్తున్న సంగతి తెలిసిందే. దాన్ని ఇలా ఫన్నిగా రిప్రజెంట్ చేశారు వెంకటేశ్.

ఈరోజు వెంకీమామ ప్రెస్ మీట్ జరిగింది. రిలీజ్ మాత్రమే కాదు, ప్రెస్ మీట్ కూడా వాయిదాలు వేస్తూ, ఫైనల్ గా ఈరోజు నిర్వహించారు. ఈ ప్రెస్ మీట్ లో మాట్లాడిన వెంకటేష్.. ఇలా తన సినిమా విడుదలను కామెడీగా మార్చేసి అందర్లో నవ్వులు పూయించాడు. ఈ సినిమా ప్రీ-రిలీజ్ ఫంక్షన్ ను త్వరలోనే ఖమ్మంలో సెలబ్రేట్ చేయబోతున్నారు. ఇప్పటికే తమన్ ఇంటర్వ్యూలతో ప్రమోషన్ స్టార్ట్ చేశారు. రేపట్నుంచి హీరోహీరోయిన్లతో ఇంటర్వ్యూలు స్టార్ట్ చేస్తున్నారు.