దేవిశ్రీపై భారీ ట్రోలింగ్

కెరీర్ లో ఎప్పుడూ ఇలాంటి పరిస్థితి ఫేస్ చేయలేదు దేవిశ్రీప్రసాద్. తన మ్యూజిక్ తో సూపర్ హిట్ అనిపించుకోవడమే తప్ప, బాగాలేదని అనిపించుకున్న సందర్భాలు చాలా తక్కువ. తన ట్యూన్స్ ను తానే కాపీ కొడుతున్నాడనే విమర్శ మినహాయిస్తే.. దేవిశ్రీపై పెద్దగా కంప్లయింట్స్ లేవు. అలా ఇన్నాళ్లూ సాఫీగా కెరీర్ లాగించిన దేవిశ్రీకి ఇప్పుడు గడ్డు పరిస్థితి ఎదురైంది. అతడి మ్యూజిక్ మరీ తీసికట్టుగా ఉందంటూ విమర్శలు పడుతున్నాయి

తాజాగా సరిలేరు నీకెవ్వరు సినిమా నుంచి ఫస్ట్ సింగిల్ రిలీజైంది. మైండ్ బ్లాక్ అనే లిరిక్స్ తో వచ్చిన ఈ పాట నిజంగానే జనాల మైండ్స్ ను బ్లాక్ చేసి పడేసింది. ఇదేం పాటరా బాబూ అంటూ శ్రోతలు గగ్గోలు పెడుతున్నారు. ఇక్కడితో ఆగలేదు. గతంలో ఇదే బాణీలో డీఎస్పీ స్వరపరిచిన పాటల్ని తెచ్చి మరీ వినిపిస్తున్నారు. దీంతో దేవిశ్రీ పరువు కాస్తా పోయింది.

పాట సూపర్ హిట్ అవుతుందనుకుంటే, ఇలా రివర్స్ లో ట్రోలింగ్ కు గురైంది. దీంతో దేవిశ్రీప్రసాద్ చిక్కుల్లో పడ్డాడు. అతడు చిక్కుల్లో పడ్డం ఒక యాంగిల్ అయితే, సేమ్ టైమ్ తమన్ తన మ్యూజిక్ తో దూసుకుపోతుండడం మరో కోణం. ఒకప్పుడు దేవిశ్రీ ధాటికి తమన్ తట్టుకోలేకపోయాడు. అప్పట్లో తమన్ ను అంతా తిట్టేవారు. కానీ ఇప్పుడు సీన్ రివర్స్ అయింది. అదే దేవిశ్రీ బాధ.