బీజేపీతో కాపురం చేస్తూనే కమ్యూనిస్టులకు కడుపు చేశారన్న మాట…

రేణుదేశాయ్‌తో కాపురం చేస్తున్న సమయంలో పవన్ కల్యాణ్‌ రష్యన్ యువతితో సహజీవనం చేసి ఆమెను గర్భవతిని చేశాడు. ఈ విషయాన్ని రేణుదేశాయ్‌ స్వయంగా ఒక ఇంటర్వ్యూలో చెప్పారు. రాజకీయాల్లోనూ పవన్ అచ్చం అదే పంథాను ఫాలో అయినట్టుగా ఉన్నారు.

తిరుపతిలో మీడియాతో మాట్లాడుతూ తాను బీజేపీకి ఏనాడు దూరం కాలేదని పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలతో కమ్యూనిస్టుల గుండెలు పగిలిపోయాయి.

బీజేపీకి ఏనాడూ దూరం కాకపోతే మరి మొన్నటి ఎన్నికల్లో తమతో ఎలా పొత్తుపెట్టుకున్నారని ప్రశ్నిస్తున్నారు. ఇది పచ్చి అవకాశవాద, వెన్నుపోటు రాజకీయం అని కమ్యూనిస్టులు మండిపడుతున్నారు.

బీజేపీ, వామపక్షాలు రెండూ భిన్న ధృవాలు అని… వాటితో ఏకకాలంలో కాపురం చేయడం సాధ్యం కాదని తెలిసి కూడా పవన్ కల్యాణ్ మోసం చేశారని వామపక్ష నాయకులు మండిపడుతున్నారు.

వైవాహిక జీవితంలో ప్రయోగించిన ఎత్తునే రాజకీయాల్లోనూ పవన్ ప్రయోగించారని మండిపడుతున్నారు. రెండో భార్య బీజేపీ అయితే… మూడో భార్య కమ్యూనిస్టులు అన్నట్టుగా పరిస్థితి ఉందని… కాకపోతే బీజేపీ అనే భార్యకు పవన్ కల్యాణ్ ఇప్పటికీ విడాకులు ఇవ్వకుండా వామపక్ష భార్యతో కాపురం చేసినట్టుగా ఉందని విమర్శిస్తున్నారు.