పాయల్ పుట్టినరోజు.. హంగామా మిస్

మొన్నటికిమొన్న రాశిఖన్నా పుట్టినరోజును గ్రాండ్ గా సెలబ్రేట్ చేసింది వెంకీమామ యూనిట్. ఆమెకు పుట్టిరోజు శుభాకాంక్షలు చెబుతూ ఏకంగా టీజర్ రిలీజ్ చేసింది. కేవలం రాశిఖన్నా విజువల్స్ తో చేసిన కట్ అది. ఈరోజు పాయల్ రాజ్ పుత్ పుట్టినరోజు. ఈసారి కూడా వెంకీ మామ నుంచి ఓ మంచి టీజర్ వస్తుందని అంతా వెయిట్ చేశారు. కానీ యూనిట్ మాత్రం పాయల్ కు హ్యాండ్ ఇచ్చింది.

రాశిఖన్నాకు ఇచ్చినంత ప్రాముఖ్యత పాయల్ రాజ్ పుత్ కు ఇవ్వలేదు వెంకీమామ యూనిట్. కేవలం ఓ చిన్న పోస్టర్ విడుదల చేసి, శుభాకాంక్షలు చెప్పి ఊరుకుంది. నిజానికి విడుదలకు సిద్ధమైన ఇలాంటి టైమ్ లో, పాయల్ లాంటి హీరోయిన్ బర్త్ డే ను క్యాష్ చేసుకోవాలి. ఈ విషయంలో యూనిట్ ఫెయిలైంది.

ఈనెల 13న థియేటర్లలోకి వస్తోంది వెంకీమామ. ఆరోజు వెంకటేష్ పుట్టినరోజు. సో.. దగ్గుబాటి ఫ్యాన్స్ కు డబుల్ బొనాంజా అన్నమాట. బాబి డైరక్ట్ చేసిన ఈ సినిమాకు తమన్ సంగీతం అందించాడు. సురేష్ బాబు నిర్మాత.