టెస్ట్ క్రికెట్ టాప్ ర్యాంక్ లో తిరిగి కొహ్లీ

  • 2వ ర్యాంక్ కు పడిపోయిన స్టీవ్ స్మిత్

సాంప్రదాయ టెస్ట్ క్రికెట్లో ప్రపంచ నంబర్ వన్ ర్యాంక్ ను భారత కెప్టెన్ విరాట్ కొహ్లీ, ఆస్ట్ర్రేలియా మాజీ కెప్టెన్ స్టీవ్ స్మిత్ నీకొకసారి.. నాకొకసారి అన్నట్లుగా… గత కొద్దిమాసాలుగా పంచుకొంటూ వస్తున్నారు.

ఇంగ్లండ్ తో ముగిసిన యాషెస్ సిరీస్ ద్వారా టెస్ట్ రీ-ఎంట్రీ చేసిన తర్వాత నుంచి టాప్ ర్యాంక్ లో స్టీవ్ స్మిత్ నిలవడంతో…. అప్పటి వరకూ ప్రపంచ నంబర్ వన్ ర్యాంక్ లో ఉన్న విరాట్ కొహ్లీ రెండోస్థానానికి పడిపోయాడు.

అయితే…పాకిస్థాన్ తో ముగిసిన సిరీస్ లో స్టీవ్ స్మిత్ విఫలం కావడంతో …టాప్ ర్యాంక్ నుంచి రెండో ర్యాంక్ కు పడిపోయాడు. మరోవైపు…బంగ్లాదేశ్ తో రెండుమ్యాచ్ ల సిరీస్ లో భాగంగా కోల్ కతా ఈడెన్ గార్డెన్స్ వేదికగా ముగిసిన డే-నైట్ టెస్టులో విరాట్ కొహ్లీ136 పరుగులతో సూపర్ సెంచరీ సాధించడం ద్వారా తిరిగి టాప్ ర్యాంక్ కు చేరుకోగలిగాడు.

విరాట్ కొహ్లీ మొత్తం 928 ర్యాంకింగ్ పాయింట్లతో…923 పాయింట్ల స్టీవ్ స్మిత్ రికార్డును అధిగమించగలిగాడు.

భారత వన్ డౌన్ ఆటగాడు పూజారా 4వ ర్యాంక్ ను నిలుపుకోగా…అజింక్యారహానే 5వ ర్యాంక్ నుంచి 6వ ర్యాంక్ కు పడిపోయాడు.

విండీస్ కెప్టెన్ జేసన్ హోల్డర్ ..ఆల్ రౌండర్ల ర్యాంకింగ్స్ లో తన ఆధిక్యాన్ని కొనసాగిస్తున్నాడు.