ఎన్‌కౌంటర్‌ను సమర్ధించిన బాలకృష్ణ… అమ్మాయిల కడుపు కేసు ఏమైందో ?

దిశ హంతకుల ఎన్‌కౌంటర్‌ను నటుడు బాలకృష్ణ స్వాగతించారు. దేశ వ్యాప్తంగా మహిళలపై ఘాతుకాలు జరుగుతున్నాయని వ్యాఖ్యానించారు. ఆ దేవుడే పోలీసుల రూపంలో సరైన శిక్ష విధించారని అభిప్రాయపడ్డారు.

మరోసారి ఇలాంటి పనులు ఎవరూ చేయకుండా, అలాంటి ఆలోచన కూడా రాకుండా ఎన్‌కౌంటర్ ఒక గుణపాఠం అవ్వాలన్నారు. తెలంగాణ పోలీసులను, ప్రభుత్వాన్ని అభినందిస్తున్నట్టు చెప్పారు.

అయితే ఇదే బాలకృష్ణ గతంలో మహిళలపై హింసను ప్రోత్సహించేలా మాట్లాడారు. అమ్మాయి కనిపిస్తే ముద్దయినా పెట్టాలి… లేదంటే కడుపైనా చేసేయాలి… అని ఓ సినిమా ఫంక్షన్‌లోనే పిలుపునిచ్చారు. దీనిపై కేసు కూడా నమోదు అయింది. కానీ అది ఏమైందో దేవుడికే తెలియాలి.