డిస్కోరాజా టీజర్ రిలీజ్

ఏ జానర్ కథనైనా టీజర్ లోనే కాస్త ఊహించుకోవచ్చు. కొంతమంది మేకర్స్ అయితే టీజర్ లోనే తమ సినిమా థీమ్ కూడా చెప్పేస్తుంటారు. కానీ సైన్స్ ఫిక్షన్ జానర్ లో తెరకెక్కుతున్న సినిమాల్ని మాత్రం ఊహించడం కష్టం. సరిగ్గా ఇలాంటి ఎలిమెంట్స్ తోనే రిలీజైంది డిస్కోరాజా టీజర్. రవితేజ హీరోగా నటించిన ఈ సినిమా టీజర్ చూసి కథ ఏంటో చెప్పడం చాలా కష్టం.

మాములుగానే దర్శకుడు వీఐ ఆనంద్ కథలు కాస్త టిపికల్ గా ఉంటాయి. డిస్కోరాజా కాన్సెప్ట్ కూడా దాదాపు అలాంటిదే. అప్పటివరకు కోమాలాంటి ఓ అచేతనమైన స్టేజ్ లో ఉన్న ఓ వ్యక్తి, ఇప్పటి జనరేషన్ మధ్యలోకి వస్తే ఎలా ఉంటుందనే చిన్న షేడ్ ను మాత్రం టీజర్ లో చూపించారు. టీజర్ లో రవితేజ రెట్రో లుక్ బాగుంది. సన్నివేశాలన్నీ చాలా రిచ్ గా ఉన్నాయి.

తమన్ ఈ టీజర్ కు మంచి బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ఇచ్చాడు. ఎస్ఆర్టీ ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై రామ్ తళ్లూరి ఈ సినిమాను నిర్మిస్తున్నాడు. నభా నటేష్, పాయల్ రాజ్ పుత్ హీరోయిన్లుగా నటిస్తున్న ఈ సినిమాను జనవరి 24న విడుదల చేయబోతున్నారు.