”సాహో సజ్జనార్‌” అంటూ మార్మోగిన ఎన్‌కౌంటర్ ప్రాంతం

దిశ ఎన్‌కౌంటర్ గురించి తెలియగానే వేలాది మంది ఘటన స్థలికి తరలివచ్చారు. చుట్టుపక్కల ఉండే ప్రజలు, విద్యార్థులు పెద్ద సంఖ్యలో ఘటన స్థలికి వచ్చారు. తెలంగాణ పోలీసులకు అనుకూలంగా యూత్ పెద్దెత్తున నినాదాలు చేశారు.

సీపీ సజ్జనార్‌ రాగానే జై సజ్జనార్‌, సాహో సజ్జ నార్ అంటూ ఆ ప్రాంతం మార్మోగించింది. తెలంగాణ పోలీసు అంటే ఏంటో చూపించారంటూ నినాదాలు చేశారు.

గతంలో సజ్జనార్ వరంగల్ ఎస్పీగా ఉన్న సమయంలో 2008 లో ఒక అమ్మాయిపై యాసిడ్ దాడి జరిగింది. యాపిడ్ దాడి చేసిన నిందితులను కూడా సజ్జనార్ నేతృత్వంలోని పోలీసులు ఎన్‌కౌంటర్‌ చేశారు.

ఆ సమయంలో కాలేజీ విద్యార్థినులు సజ్జనార్ వద్దకు వెళ్లి పుష్పగుచ్ఛాలతో కృతజ్ఞతలు తెలిపారు.