తెలంగాణ పోలీసులను చూసి నేర్చుకోండి – యోగి ప్రభుత్వంపై మాయావతి ఫైర్

దిశ హంతకుల ఎన్‌కౌంటర్‌ను బీఎస్పీ అధినేత్రి మాయావతి స్వాగతించారు. తెలంగాణ పోలీసులను అభినందించారు. అదే సమయంలో ఉత్తరప్రదేశ్‌ ప్రభుత్వంపై ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఉత్తరప్రదేశ్‌ ఉన్నావ్‌లో అత్యాచారం కేసులో అరెస్ట్ అయి బెయిల్‌పై వచ్చిన నిందితులు తిరిగి బాధితురాలిని సజీవదహనం చేసేందుకు ప్రయత్నించడం, బాధితురాలు 90 శాతం కాలిన గాయాలతో మృత్యువుతో పోరాటం చేస్తున్న నేపథ్యంలో మాయావతి తీవ్రంగా స్పందించారు.

ఉత్తరప్రదేశ్‌లో మహిళలపై దాడులు పదేపదే జరుగుతున్నా యోగి ప్రభుత్వం ఏం చేస్తోందని ప్రశ్నించారు. రాష్ట్రంలోని బీజేపీ ప్రభుత్వం నిద్రపోతోందా అని నిలదీశారు. ఉత్తరప్రదేశ్‌ పోలీసులు తెలంగాణ పోలీసుల నుంచి స్పూర్తి పొందాలని సూచించారు.