నారాయణకు నివాళులర్పించిన జగన్ దంపతులు

సీఎం వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి వ్యక్తిగత సహాయకుడు నారాయణ అనారోగ్యంతో కన్నుమూశారు. ఈ విషయం తెలియగానే ముఖ్యమంత్రి దిగ్బ్రాంతి చెందారు. ఢిల్లీ పర్యటనలో ఉన్న జగన్‌మోహన్ రెడ్డి నారాయణ మృతి విషయం తెలియగానే ఢిల్లీ నుంచి హైదరాబాద్ బేగంపేట విమానాశ్రయానికి వచ్చారు.

అక్కడి నుంచి విమానంలో కడపకు వెళ్లారు. కడప విమానాశ్రయం నుంచి హెలికాప్టర్లో నారాయణ స్వగ్రామం అనంతపురం జిల్లా దిగువపల్లెకు వెళ్లారు. భార్య భారతిలో కలిసి నారాయణకు నివాళులర్పించారు. కుటుంబసభ్యులను ఓదార్చారు. నారాయణ కుటుంబానికి అండగా ఉంటామని జగన్‌ దంపతులు ధైర్యం చెప్పారు.

ముఖ్యమంత్రి దంపతులతో పాటు మంత్రి శంర్‌ నారాయణ, పలువురు జిల్లా వైసీపీ ఎమ్మెల్యేలు నారాయణకు నివాళుర్పించారు. వైఎస్ కుటుంబంతో నారాయణ కొన్ని దశాబ్దాలుగా అనుబంధం ఉంది. వైఎస్ జగన్‌కు వ్యక్తిగత సహాయకుడిగా పనిచేశారు.