సహ నిర్మాతగా మారిన బాలకృష్ణ

లెక్కప్రకారం బోయపాటి-బాలయ్య సినిమాకు మిర్యాల రవీందర్ రెడ్డి నిర్మాత. నిన్ననే ఈ సినిమా గ్రాండ్ గా లాంఛ్ అయింది. అయితే ఈ మూవీకి సంబంధించి ఇప్పుడో ఇంట్రెస్టింగ్ అప్ డేట్ బయటకొచ్చింది. ఈ సినిమాలో కేవలం హీరోగా నటించడమే కాకుండా, సహ-నిర్మాతగా కూడా వ్యవహరిస్తున్నాడట బాలయ్య.

సహ-నిర్మాత అంటే రవీందర్ రెడ్డితో పాటు డబ్బులు పెట్టడం లేదు. సినిమాకు బాలయ్య పారితోషికం తీసుకోవడం లేదు. సహ-నిర్మాత హోదాలో బిజినెస్ లో వాటా తీసుకుంటున్నాడన్నమాట. అదీ సంగతి. అయితే సహ-నిర్మాతగా బాలయ్య పేరు వేస్తారా.. లేక తెరవెనక పార్టనర్ గా నే అతడు ఉండిపోతాడా అనేది ఇంకా తేలాల్సి ఉంది.

మరోవైపు ఈ సినిమాలో హీరోయిన్ గా నయనతారను తీసుకునేందుకు బోయపాటి విశ్వప్రయత్నం చేస్తున్నాడు. కానీ తెలుగు సినిమాల్లో నటించేందుకు నయన్ ప్రస్తుతం పెద్దగా ఆసక్తి చూపించడం లేదు. రీసెంట్ గా సైరాలో కనిపించింది నయనతార. ఆ సినిమాలో నయన్ కంటే తమన్నాకే మంచి మార్కులు పడ్డాయి. దీంతో ఆమె తెలుగు సినిమాలు ఆపేయాలనే ఉద్దేశంలో ఉంది.