అయిపోయిన దానికి మీ సలహా ఏమిటి రామకృష్ణా?

ఆంధ్రప్రదేశ్‌ సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణకు నిరంతరం మీడియాలో కనిపించాలనే తాపత్రయం అంతా ఇంతా కాదు. అలాంటి తాపత్రయమే ఇప్పుడు ఇంకోసారి ప్రదర్శించాడు.

ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి జగన్‌ మోహన్‌ రెడ్డికి లేఖ రాస్తూ జీరో ఎఫ్‌ఐఆర్‌ నమోదుకు ఆదేశాలివ్వాలన్నారు.

అయితే రామకృష్ణకు తెలియని విషయం ఏమిటంటే ఆయన లేఖ రాయడానికి నాలుగు రోజుల ముందే ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం జీరో ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేయాలని నిర్ణయం తీసుకుంది. అంతేకాదు ఒక జీరోఎఫ్‌ఐఆర్‌ నమోదు అయ్యింది కూడా.

ఈ విషయాలేమీ తెలియని రామకృష్ణ ఒక పార్టీకి రాష్ట్రకార్యదర్శిగా ఉండడం, ఇలాంటి లేఖ రాయడం విశేషం.