మరోసారి అదే తేదీ చెప్పాడు

రాజ్ తరుణ్, షాలినీ పాండే హీరోహీరోయిన్లుగా నటిస్తున్న సినిమా ‘ఇద్దరి లోకం ఒకటే’. ఈ సినిమాను క్రిస్మస్ కానుకగా డిసెంబర్ 25వ విడుదల చేయబోతున్నట్టు గతంలోనే ప్రకటించారు. ఆ మేరకు పోస్టర్ కూడా విడుదల చేశారు. అయితే తాజాగా మరోసారి ప్రెస్ మీట్ పెట్టి మరీ అదే విషయాన్ని మళ్లీ రిపీట్ చేశారు. మేకర్స్ ఇలా చేయడానికి ఓ కారణం ఉంది.

మొన్నటివరకు వెంకీమామ విడుదలపై స్పష్టత లేదు. ఒక దశలో ఆ సినిమాను డిసెంబర్ 25కే విడుదల చేస్తారని పుకార్లు వచ్చాయి. అదే కనుక జరిగితే రాజ్ తరుణ్ సినిమా రాదని కూడా కథనాలు వచ్చేశాయి. అయితే అనుకోని విధంగా వెంకీమామను డిసెంబర్ 13కు ఫిక్స్ చేశారు. దీంతో ఇద్దరి లోకం ఒకటే సినిమా విడుదలకు లైన్ క్లియర్ అయింది.

ఇదే విషయాన్ని చెప్పడం కోసం ఈరోజు మరోసారి ప్రెస్ మీట్ పెట్టారు. స్వయంగా నిర్మాత దిల్ రాజు ఈ సినిమా విడుదలపై ఫుల్ క్లారిటీ ఇచ్చారు. క్రిస్మస్ కానుకగా డిసెంబర్ 25న రాబోతున్నామని ప్రకటించాడు. ఈ సినిమా హీరోహీరోయిన్లకు చాలా కీలకం. ఇది కూడా ఫ్లాప్ అయితే రాజ్ తరుణ్ కెరీర్ మరింత కష్టాల్లో పడుతుంది. అటు షాలినీకి కూడా ఈ సినిమా సక్సెస్ అవసరం.