మొదటి రోజే అల్లాడించిన బాలయ్య

బాలయ్య, బోయపాటి కాంబినేషన్ కు ఉన్న క్రేజ్ గురించి కొత్తగా చెప్పేదేముంది. సింహా, లెజెండ్ లాంటి రెండు బ్లాక్ బస్టర్స్ ఇచ్చింది ఈ కాంబినేషన్. ఇప్పుడు వీళ్ల కాంబోలో మరో సినిమా రెడీ కాబోతోంది. ఆ మూవీ ఓపెనింగ్ ఈరోజు అట్టహాసంగా జరిగింది. ముహూర్తం సన్నివేశానికి బి.గోపాల్ క్లాప్ కొట్టగా, నిర్మాత అంబికా కృష్ణ కెమెరా స్విచాన్ చేశారు.

సింహా, లెజెండ్ సినిమాల్లో డైలాగ్స్ సూపర్ హిట్. మరీ ముఖ్యంగా చూడు.. ఒకవైపే చూడు అనే డైలాగ్ అయితే ఇప్పటికీ పాపులర్. ఈ కొత్త సినిమాలో కూడా అలాంటి డైలాగ్స్ చాలా ఉన్నాయి. అందులో మచ్చుకు ఒకటి ఈరోజే వదిలారు. ముహూర్తం షాట్ లోనే బాలయ్యతో పంచ్ డైలాగ్ చెప్పించాడు బాలయ్య. నువ్వొక మాటంటే అది ‘శబ్దం’ అదే మాట నేనంటే అది ‘శాసనం‘’అనే పవర్‌ఫుల్‌ డైలాగ్‌ను బాలయ్య చెప్పగా షాట్ ఓకే చేశారు.

ప్రస్తుతం రూలర్ అనే సినిమా చేస్తున్నాడు బాలయ్య. ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ పూర్తయిన వెంటనే బోయపాటి సినిమా సెట్స్ పైకి వస్తుంది. తమన్ ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నాడు.