మరోసారి విదేశాలకు చెక్కేసిన ప్రభాస్

ఎవరైనా సమ్మర్ లో విదేశాలకు వెళ్తారు. కానీ ప్రభాస్ మాత్రం మంచి చలికాలంలో ఫారిన్ టూర్ పెట్టుకున్నాడు. పైగా ఈమధ్యే విదేశాలకు వెళ్లొచ్చాడు ప్రభాస్, అంతలోనే మళ్లీ విదేశాలకు వెళ్తున్నాడు. దీనికి ఓ కారణం ఉంది.

సాహో తర్వాత ప్రభాస్ పూర్తిగా డైలమాలో పడ్డాడు. ఎన్నో అంచనాలు, ఆలోచనలతో చేసిన ఆ సినిమా బోల్తాకొట్టడంతో ప్రభాస్ నిరాశ చెందాడు. అందుకే ఇప్పుడు జాన్ సినిమాపై మరింత దృష్టిపెట్టాడు. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించి 2 షెడ్యూల్స్ కంప్లీట్ అయ్యాయి.

అయినప్పటికీ, సినిమా స్క్రీన్ ప్లేను మరోసారి మార్చమని, మరింత పకడ్బందీగా తయారుచేయమని దర్శకుడు రాధాకృష్ణకు చెప్పాడు ప్రభాస్. అందుకే నెక్ట్స్ షెడ్యూల్ ను నెల రోజులు వాయిదా వేశాడు. ఈ గ్యాప్ లో మరో ఫారిన్ టూర్ కు వెళ్లాడు.

విదేశాల నుంచి వచ్చిన తర్వాత మరోసారి జాన్ కథ మొత్తం విని, అప్పుడు సినిమా షూటింగ్ పై నిర్ణయం తీసుకుంటాడు యంగ్ రెబల్ స్టార్. అప్పటికీ నచ్చకపోతే సినిమా షూటింగ్ ను మరో నెల రోజులు వాయిదా వేయడానికి ఏమాత్రం మొహమాటపడడం లేదు ఈ హీరో.